Gold Price Today: భగభగమంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంతంటే..?
Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరగటం ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు, గోల్డ్ బ్రోకర్లు చెబుతున్నారు.
నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.300 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,800, ముంబైలో రూ.55,450, దిల్లీలో రూ.55,600, కలకత్తాలో రూ.55,450, బెంగళూరులో రూ.55,450, కేరళలో రూ.55,450, వడోదరలో రూ.55,500, అహ్మదాబాదులో రూ.55,500, జైపూర్ లో రూ.55,600, కోయంబత్తూరులో రూ.55,800, భువనేశ్వర్‌లో రూ.55,450, నాశిక్ లో రూ.55,480 వద్ద ఉన్నాయి.

24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.330 పెరుగుదలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,870, ముంబైలో రూ.60,490, దిల్లీలో రూ.60,640, కలకత్తాలో రూ.60,490, బెంగళూరులో రూ.60,490, కేరళలో రూ.60,490, వడోదరలో రూ.60,540, అహ్మదాబాదులో రూ.60,540, జైపూర్ లో రూ.60,640, కోయంబత్తూరులో రూ.60,870, భువనేశ్వర్‌లో రూ.60,490, నాశిక్‌లో రూ.60,530 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,450 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,490గా ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లలో సైతం పైన పేర్కొన్న ధరలే కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే నిన్నటితో పోల్చితే కిలోకు రూ.1,000 పెరిగి రూ.81,500 వద్ద తెలుగు రాష్ట్రాల్లో విక్రయించబడుతున్నాయి.


Click it and Unblock the Notifications