Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు..
గత కొన్ని రోజులుగా, బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించగా.. ఈరోజు ఈ రెండు విలువైన లోహాల ధరులు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం, వెండి పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల ధర రూ. 58,674 వద్ద ప్రారంభమైంది. దీని తర్వాత మరింత వృద్ధి కనిపించి ఉదయం 11.30 గంటల సమయానికి 10 గ్రాముల ధర రూ.58,715కి చేరింది. ఇందులో నిన్నటితో పోలిస్తే రూ.127 లేదా 0.22 శాతం పెరుగుదల నమోదైంది. నిన్న MCXలో బంగారం ధర 10 గ్రాములకు రూ.58,588 వద్ద ముగిసింది.
బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. ఈరోజు ప్రారంభంలో కిలో వెండి రూ.71,260 వద్ద ట్రేడవుతోంది. దీని తరువాత దాని ధర మరింత పెరిగింది. ఉదయం 11.30 గంటల వరకు 10 గ్రాములు రూ.71,750 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.768 అంటే 1.08 శాతం పెరిగింది. నిన్న ఫ్యూచర్స్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.71,600 వద్ద ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర విషయానికొస్తే హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.60,735గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,150గా నమోదు అయింది.

విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,735గా ఉంది. కిలో వెండి ధర రూ.73,150గా ఉంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.59,820, వెండి కిలో రూ.74,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.59,670, వెండి కిలో రూ.74,000 గా అమ్ముతున్నారు. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.59,670, వెండి కిలో రూ.74,000, చెన్నై 24 క్యారెట్ల బంగారం రూ.60,000, వెండి కిలో రూ.77,500, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.59,670, వెండి కిలో రూ.72,000 గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ లో శుక్రవారం బంగారం, వెండి పెరిగాయి. గత కొన్ని వారాల్లో బంగారం భారీ పతనం తర్వాత, 0.3 శాతం లాభంతో ఔన్స్ $ 1,915.09 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర శుక్రవారం 1 శాతం పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు $ 22.86 వద్ద ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications