బంగారం ప్రియులకు శుభవార్త. సోమవారం పుత్తడి ధర తగ్గింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 10 తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 70,570కి చేరింది. వెండి కిలో ధర కూడా రూ.100 తగ్గి రూ.85,400 గా ఉంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 10 తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి రూ.64,690 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,580గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 64, 700 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,720 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,840 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,570గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 64,700 గా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,560గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.64,690 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.70,570 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.64,690 గా ఉంది.
లాభాల స్వీకరణ మధ్య US బంగారం ధరలు సోమవారం తగ్గాయి. అయితే మాంద్యం ఆందోళనలు, US వడ్డీ రేటు తగ్గింపుల పెరుగుదల అంచనాలు మరింత ప్రతికూలతను పరిమితం చేశాయి.
స్పాట్ వెండి ఔన్సుకు $28.55 వద్ద కొద్దిగా మారగా, ప్లాటినం 0.76 శాతం తగ్గి $950.60కి చేరింది. పల్లాడియం 0.8 శాతం క్షీణించి $884.73కి చేరుకుంది. శ్రావణ మాసం కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ శ్రావణ మాసంలో పుత్తడి ధరలు పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications