మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. ముఖ్యంగా భారతీయ మహిళలు పుత్తడిని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం బంగారం ధర చూస్తే కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. అయితే భారీగా పెరిగి.. కొంచెం కొంచెం తగ్గుతోంది. దీంతో పుత్తడి ధరలో అస్థిరత కొనసాగుతోంది. గురువారం రూ.1000 తగ్గిన స్వర్ణం.. శుక్రవారం మాత్రం కేవలం రూ.10 మాత్రమే తగ్గింది.
అంటే బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెంట్ల బంగారం ధర రూ. 73,410 గా ఉంది. గురువారం ఇదే బంగారం రూ.73,420 గా ఉంది. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర 67,290 గా ఉంది. 10 గ్రాముల అంటే తులంతో సమానం. అయితే పాత, కొత్త తులాలు కూడా ఉన్నాయి. పాత తులం అంటే 12 గ్రాములు, కొత్త తులం అంటే 10 గ్రాములు. ప్రస్తుతం కొత్త ప్రకారమే కొనుగోలు చేస్తున్నారు.

అటు ఏపీలోని విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార ధర రూ. 73,420 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,290 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 73,410 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,290గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.73,560 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ.67,440గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 73,630 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 73,410గా ఉంది. దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గినా.. అంతర్జాతీయ పరిస్థితులతో పుత్తడి ధరలో పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అటు వెండి కిలో రూ. 94,600 గా ఉంది.


Click it and Unblock the Notifications