బంగారం ధరలో అస్థిరత కొనసాగుతోంది. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతోంది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,300 ఉండగా, మంగళవారం నాటికి రూ.720 తగ్గి రూ.74,580కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ. 94,500 ఉండగా, సోమవారం నాటికి 1,020 తగ్గి రూ.93,475కు తగ్గింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.74,580గా ఉండగా.. కిలో వెండి ధర రూ.93,475 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 67,440 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం గ్రాముకు రూ. 73570 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాము పుత్తడి ధర రూ. 67440 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,990 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 74170 గా ఉంది. ఢిల్లీలో ఈరోజు క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.73720 గా ఉంది. మంగళవారం ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, వెండి ధరలు కిలోకు రూ. 800 కంటే ఎక్కువ పెరిగి రూ. 93,400 పైనే ఉన్నాయి.
జూలై 9న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు కిలో ధర రూ.93,383కు విక్రయించబడుతోంది, సోమవారంతో పోలిస్తే రూ.769 పెరిగింది. సోమవారం వెండి కిలో ధర రూ.92,614 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications