Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..!
బంగారం కొనేవారికి శుభవార్త అందింది. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.64,500గా ఉంది. బుధవారం ఇది రూ.64,560గా ఉంది. రూ.60 తగ్గింది. ఇక వెండి కిలో రూ.274 తగ్గి 71,800 లకు చేరింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ.64,500 గా ఉంది. వెండి కిలో రూ.71,800 గా ఉంది.
కరీంనగర్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.64,500 గా ఉంది. వెండి కిలో రూ.71,800 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.64,500 గా ఉంది. కిలో వెండి రూ. 71,800 గా ఉంది. ఢిల్లీలో ప్రజలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 58,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కోసం రూ.63,330 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,720గా ఉంది. బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.63,240 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2033 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.24 డాలర్లలో ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications