శుక్రవారం డిసెంబర్ 29, 2023 భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం రూ.63 వేలు దాటితే, వెండి కిలో ధర రూ.73 వేలకు పైగా ఉంది. జాతీయ స్థాయిలో 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63332గా ఉంది. 999 స్వచ్ఛత గల కిలో వెండి ధర రూ.73758గా ఉంది. శుక్రవారం తులం ధరల మీద రూ. 350 నుంచి రూ. 380 వరకు తగ్గింది.
హైదరాబాద్ 22 క్యారెట్ల ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,855 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 6,387గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58550, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870గా ఉంది. గురువారం రూ.400 నుంచి రూ.430 పెరిగిన పసిడి ధరలు శుక్రవారం రూ.350 నుంచి రూ.380 వరకు తగ్గాయి. వెండి ధరలు కూడా శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఒక కేజీ బంగారం ధర మీద రూ.1300 తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాలు చూసుకుంటే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,470 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63970గా ఉంది. భవిష్యత్ లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications