బంగారం ప్రియులకు శుభవార్త వచ్చింది. శుక్రవారం పుత్తడి, వెండి ధరలు తగ్గాయి. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210 ఉండగా, శుక్రవారం నాటికి రూ.210 తగ్గి రూ.73,000కు చేరింది. ఇక గురువారం కిలో వెండి ధర రూ.90,180 ఉండగా, శుక్రవారం నాటికి రూ.530 తగ్గి రూ.89,650కు చేరింది.హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. రూ.72,150 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. రూ.66,140గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,890 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ.72,040 గా ఉంది.కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,900 గా ఉంది. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,550 గా ఉంది.చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,500 ఉండగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72, 400 గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2312 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 6 డాలర్లు తగ్గి 2306 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29 డాలర్లుగా కొనసాగుతోంది. బంగారానికి స్వచ్ఛతన బట్టి ధర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారంగా ఉంటుంది. దీనిలో రాగి కలిపితే 22 క్యారెట్ల బంగారంగా మారుతుంది. ఆభరణాలు 22 క్యారెట్లలోనే ఉంటాయి.


Click it and Unblock the Notifications