బంగారం, వెండి ధరలు ఈ రేటు వద్దకు దిగి వస్తేనే కొనుగోలు చేయండి.. కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు ఊహకు అందండం లేదు. ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. నిన్న పడిన ధరలు నేడు అమాంతం పెరుగుతున్నాయి. అలాగే నేడు పెరిగిన ధరలు రేపు భారీగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలొ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. పెట్టుబడిదారులు అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టాలా వద్దా అనే మీమాంసలో పడిపోయారు. ఇక సామాన్యులు అయితే కొనుగోలుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు నీరు గారే విధంగా బంగారం ధరల పరిస్థితి ఉంది. డబ్బు చేతికి అందగానే కొందాములు అనుకునే లోపే పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి.

ఇటీవల MCXలో Gold, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం గరిష్ట స్థాయి నుంచి 20 శాతం కంటే ఎక్కువగా పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఒక కీలక ప్రశ్నను లేవనెత్తింది. ఇది కొనుగోలు చేయడానికి సరైన సమయమా? లేక మరింత పతనం కోసం వేచి చూడాలా? అనే ప్రశ్నను వదిలింది. ఫిబ్రవరి 18న జరిగిన ఇంట్రాడే ట్రేడింగ్‌లో MCX ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు 10 గ్రాములకు సుమారు రూ. 1,52,719కి తగ్గాయి.

Gold price today MCX gold price gold price crash gold price correction gold down 20 percent MCX gold fall gold investment 2026 should buy gold now gold buying on dips silver price today MCX silver price gold vs silver investment precious metals investment gold price outlook gold market analysis safe haven assets inflation hedge gold commodity market news India bullion prices today long term gold investment MCX 20 2026 MCX vs
Photo Credit:

ఇది గతంలో నమోదైన రూ. 1,93,096 గరిష్ట స్థాయి నుంచి దాదాపు రూ. 40 వేలు లేదా సుమారు 21 శాతం తగ్గుదల. అదే సమయంలో, MCX మార్చి వెండి కాంట్రాక్టులు కూడా భారీగా పడిపోయాయి. కిలోకు రూ. 4,20,048 గరిష్ట స్థాయి నుంచి సుమారు రూ. 1,88,000 వరకూ తగ్గి.. దాదాపు 45 శాతం కరెక్షన్‌ను చూపించాయి.

Geojit Investments లో కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ.. Gold, వెండి గత కొన్ని సంవత్సరాల్లో బలమైన ర్యాలీని చూశాయని, ప్రస్తుతం మాత్రం మధ్యస్థ కాలంలో అస్థిరత కొనసాగవచ్చని తెలిపారు.సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాస్తవ వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశాలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. అందుకే, ఈ కరెక్షన్‌ను డిప్‌లో కొనుగోలు చేసే అవకాశంగా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడప్పుడూ వచ్చే పుల్‌బ్యాక్‌లు ఆరోగ్యకరమైన కన్సాలిడేషన్ దశలో భాగమే. క్రమశిక్షణతో, విడతలుగా బంగారాన్ని సేకరించడం దీర్ఘకాలంలో లాభదాయకం కావచ్చని హరీష్ సూచించారు.

ఇక వెండి విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి ఒకవైపు విలువైన లోహం కాగా, మరోవైపు పారిశ్రామిక వినియోగంతో బలంగా అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఆర్థిక వృద్ధి లేదా మందగమనం దాని ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హరీష్ ప్రకారం చూసుకున్నట్లయితే దీర్ఘకాలంలో వెండికి బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేయడం కంటే చిన్న విడతలుగా చేరడం మంచిదని సూచించారు.

SMC Globalలో కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతి మాట్లాడుతూ.. ప్రపంచ రుణ స్థాయిలు పెరగడం, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం, అలాగే 2026 రెండో భాగంలో వడ్డీ రేట్ల కోతల అవకాశాలు బంగారానికి నిర్మాణాత్మక మద్దతునిస్తున్నాయని చెప్పారు. వెండి విషయంలో మాత్రం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలపడితే బంగారాన్ని మించిపోవచ్చని, కానీ మందగమనం వస్తే తీవ్ర అస్థిరత ఎదురవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

చైనా మార్కెట్లు తిరిగి ప్రారంభమైన తర్వాత, అక్కడి నుంచి వచ్చే భౌతిక డిమాండ్ కారణంగా ధరల్లో మరింత అస్థిరత కనిపించే అవకాశం ఉందని, అదే సమయంలో ర్యాలీలకు కూడా ఊపునివ్వొచ్చని భారతి పేర్కొన్నారు. ప్రత్యేకంగా బంగారం విషయంలో రూ. 1,48,000 నుంచి రూ. 1,53,000 మధ్య ధరలు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అనుకూలమైన అక్యుములేషన్ జోన్‌గా కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ ధరలో కొనుగోలు చేయడం ఉత్తమమని చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు రూ. 2,12,000 నుంచి రూ. 2,30,000 పరిధిలో మరింత తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఆకర్షణీయమైన అవకాశంగా మారవచ్చని భారతి అభిప్రాయపడ్డారు.

దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఖచ్చితమైన ఎంట్రీ కోసం ఆందోళన పడకుండా 5 నుంచి 10 శాతం పుల్‌బ్యాక్‌లలో విడతలుగా కేటాయింపులు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ట్రేడర్లకు మాత్రం ఈ దశలో రెండు వైపులా పదునైన కదలికలు ఉండే అవకాశమున్నందున చురుకైన నిర్వహణ అవసరమని చెబుతున్నారు. ఏదేమైనా బంగారం ధరల్లో వచ్చిన ఈ భారీ కరెక్షన్ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవకాశంగా మారవచ్చు. వెండి విషయంలో మాత్రం అధిక అస్థిరతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందడుగు వేయాలని నిపుణులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+