Gold Rate Today: శుభవార్త.. మళ్లీ పడిపోయిన పసిడి.. AP, TSలో ఇవాళ్టి రేట్లు ఇవే..
Gold Rate Today: గాజా సరిహద్దుల్లో కాల్పుల విరమణకు బాటలు పడిన వేళ ఆందోళనలు తగ్గటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో 10 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడి ఆకాశానికి చేరిన ధరలు క్రమంగా నేలకు దిగివస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,150, ముంబైలో రూ.54,950, దిల్లీలో రూ.55,100, కలకత్తాలో రూ.54,950, బెంగళూరులో రూ.54,950, కేరళలో రూ.54,950, వడోదరలో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, కోయంబత్తూరులో రూ.55,150, సూరత్ లో రూ.55,000, మంగళూరులో రూ.54,950, నోయిడాలో రూ.55,100, నాశిక్ లో రూ.54,980 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.160 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,160, ముంబైలో రూ.59,950, దిల్లీలో రూ.60,100, కలకత్తాలో రూ.59,950, బెంగళూరులో రూ.59,950, కేరళలో రూ.59,950, వడోదరలో రూ.60,000, జైపూర్‌లో రూ.60,100, కోయంబత్తూరులో రూ.60,160, సూరత్ లో రూ.60,000, మంగళూరులో రూ.59,950, నోయిడాలో రూ.60,100, నాశిక్‌లో రూ.59,980గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి రేట్లు రూ.54,950గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,950 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే కేజీకి రూ.500 తగ్గి తెలుగు రాష్ట్రాల్లో రూ.77,000 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications