Gold Rate Today: పసిడి ప్రియులకు మళ్లీమళ్లీ ఇది రాని ఆఫర్.. తగ్గిన గోల్డ్ ఇవాళ్టి ధరలు ఇవే..
Gold Rate Today: మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల మూడ్.. బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX) డేటా చెబుతోంది.
దాదాపు 10 రోజులుగా పసిడి ధరలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు నిన్నటి కంటే రూ.10 తగ్గింది. దీంతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.52,850, ముంబైలో రూ.52,590, దిల్లీలో రూ.52,750, కలకత్తాలో రూ.52,590, కేరళలో రూ.52,590, వడోదరలో రూ.52,650, జైపూర్ లో రూ.52,750, కోయంబత్తూరులో రూ.52,850, నాగపూర్ లో రూ.52,590, మంగళూరులో రూ.52,590, నాశిక్ లో రూ.52,620, బళ్లారిలో రూ.52,590, గురుగ్రామ్ లో రూ.52,750 వద్ద రిటైల్ మార్కెట్లో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటి కంటే రూ.10 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,650, ముంబైలో రూ.57,370, దిల్లీలో రూ.57,530, కలకత్తాలో రూ.57,370, కేరళలో రూ.57,370, వడోదరలో రూ.57,430, జైపూర్ లో రూ.57,530, కోయంబత్తూరులో రూ.57,650, నాగపూర్ లో రూ.57,370, మంగళూరులో రూ.57,370, నాశిక్ లో రూ.57,400, బళ్లారిలో రూ.57,370, గురుగ్రామ్ లో రూ.57,530 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖ, అనంతపురం, కడప, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,590గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,370 వద్ద విక్రయించబడుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కిలోకు రూ.300 తగ్గటంతో రిటైల్ మార్కెట్లో రూ.73,100 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications