ఇటీవల బంగారం, వెండి మార్కెట్లు భారీ పెరుగుదల తర్వాత కొంతమేర చల్లబడాయి. గత రెండు నెలలుగా బంగారం ధరలు అద్భుతమైన పెరుగుదల సాధించిన తర్వాత, ఇప్పుడు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగారం, వెండి కొనాలా లేదా ఇంకొంచెం వేచి చూడాలా? అని పెట్టుబడిదారులు ప్రశ్నించుకుంటున్నారు.
తొమ్మిది వారాలపాటు సాగిన విజయ పరంపరను బంగారం ఎట్టకేలకు ముగించింది. ప్రపంచ మార్కెట్లలో లాభాల స్వీకరణ, అమెరికా-చైనా వాణిజ్య చర్చలలో సానుకూల పరిణామాలు బంగారం ధరలపై ఒత్తిడిని తెచ్చాయి. సోమవారం నాటికి MCXలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,22,600 వద్ద ట్రేడయ్యాయి. ఇది వారం క్రితం కంటే 3 శాతం తక్కువ అని చెప్పుకోవచ్చు.

యాక్సిస్ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు దేవేయ గగ్లానీ ప్రకారం.. ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం, ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాల ముందు ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం సహజం. ఫెడ్ ఈ వారం 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోతను ప్రకటించే అవకాశం ఉంది.అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , జపాన్ బ్యాంక్ స్థిరమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించే సూచనలున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో భౌతిక డిమాండ్ కొంత బలహీనపడింది. కాబట్టి దేశీయంగా రూ.1,17,000 వద్ద బలమైన మద్దతు ఉంది. అంటే ఈ స్థాయికి వచ్చినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం ఉత్తమమని తెలిపారు. ఇక నిరోధం రూ.1,24,000 వద్ద ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. అంటే ఈ స్థాయి వద్ద కొనుగోలు ఆపేయడం మంచిదని అర్థం.
ఆస్పెక్ట్ బులియన్ CEO దర్శన్ దేశాయ్ మాట్లాడుతూ.. US-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావాదం, US డాలర్ బలపడటం వలన సురక్షిత ఆస్తులపై (బంగారం, వెండి) డిమాండ్ తగ్గుతోంది. అయితే, ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం, ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు వంటి కీలక సంఘటనలు ధరలలో అస్థిరతను కలిగించవచ్చని అన్నారు.వెండి కూడా Gold తో సమానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం MCXలో వెండి కేజీ ధర రూ.1,46,900 వద్ద ఉంది.
మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి ప్రకారం.. డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనా-భారత్‌తో అమెరికా చర్చల పురోగతి వెండి ధరలపై ప్రతికూల ప్రభావం చూపాయి. గాజా ప్రాంతంలో శాంతి సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని తెలిపారు. ఆయన ప్రకారం Gold రూ.1,22,000 వద్దకు వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే లాభాలు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రూ.1,24,800 వద్దకు బంగారం చేరినప్పుడు కొనుగోలు ఆపేయాలని సూచిస్తున్నారు. ఇక వెండికి రూ.1,45,000 వద్ద మద్దతు, రూ.1,48,700 వద్ద నిరోధం ఉంది.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ ప్రకారం.. ఇది ఒక ఆరోగ్యకరమైన దిద్దుబాటు. ETFల నుండి ఉపసంహరణలు, లాభాల స్వీకరణ, అమెరికా-చైనా ఉద్రిక్తతల తగ్గుదల వల్ల ఈ క్షీణత వచ్చిందని తెలిపారు.
ఆమె అభిప్రాయం ప్రకారం అమెరికా ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు కొనసాగుతాయనే అంచనాలు బంగారం, వెండి ధరలకు దిగువ స్థాయి మద్దతును ఇస్తాయి. కానీ స్వల్పకాలంలో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం కొనుగోలు స్థాయి రూ. 1,22,000 వద్ద ప్రారంభించవచ్చని చెబుతున్నారు. అలాగే వెండి కొనుగోలు స్థాయి రూ. 1,46,000 పరిధిలో ఆసక్తికరమని సూచిస్తున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే బంగారం, వెండి పెట్టుబడుల్లో ఇది తొందరపడి దూకే సమయం కాదు.మార్కెట్ ఇంకా అంతర్జాతీయ నిర్ణయాల దిశను గమనిస్తోంది. పెట్టుబడిదారులు కొంతకాలం వేచి, ధరలు స్థిరపడిన తర్వాత దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి



Click it and Unblock the Notifications