Gold Rate: మళ్లీ తగ్గిన గోల్డ్ రేటు.. వరుసగా మూడోరోజు షాపింగ్ హడావిడి..
Gold Price Today: సోమవారం పతనం తర్వాత స్థిరంగా కొనసాగిన గోల్డ్ ధరలు నేడు కూడా తగ్గుదలను చూశాయి. అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల తగ్గింపులపై కొనసాగుతున్న అంచనాల మధ్య పసిడి కూడా నిశితంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అలాగే శుభకార్యాల సీజన్ ముగియటంతో కొంత డిమాండ్ తగ్గుదలను చూసింది.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6669, ముంబైలో రూ.6669, దిల్లీలో రూ.6684, కలకత్తాలో రూ.6669, బెంగళూరులో రూ.6669, కేరళలో రూ.6669, వడోదరలో రూ.6674, జైపూరులో రూ.6684, మంగళూరులో రూ.6669, నాశిక్ లో రూ.6672, అయోధ్యలో రూ.6684, బళ్లారిలో రూ.6669, నోయిడాలో రూ.6684, గురుగ్రాములో రూ.6684గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.100 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7276, ముంబైలో రూ.7276, దిల్లీలో రూ.6684, కలకత్తాలో రూ.7276, బెంగళూరులో రూ.7276, కేరళలో రూ.7276, వడోదరలో రూ.7281, జైపూరులో రూ.7291, మంగళూరులో రూ.7276, నాశిక్ లో రూ.7279, అయోధ్యలో రూ.7291, బళ్లారిలో రూ.7276, నోయిడాలో రూ.7291, గురుగ్రాములో రూ.7291గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6669గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7276 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.90,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications