Gold Rate: భారతీయ పసిడి ప్రియులకు ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. దాదాపు మూడు వారాలకు పైగా బంగారం ధరల పెరుగుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాబోతున్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా ప్రస్తుతం డిమాండ్ తిరిగి పుంజుకుంటోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గింది. తగ్గిన రిటైల్ విక్రయ ధరలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,500, ముంబైలో రూ.57,950, దిల్లీలో రూ.58,100, బెంగళూరులో రూ.57,950, కలకత్తాలో రూ.57,950, కేరళలో రూ.57,950, వడోదరలో రూ.58,000, జైపూరులో రూ.58,100, లక్నోలో రూ.58,100, కోయంబత్తూరులో రూ.58,500, సూరత్ రూ.58,000 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.160 మేర క్షీణించింది. ఈ క్రమంలో రిటైల్ విక్రయ ధరలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,820, ముంబైలో రూ.63,220, దిల్లీలో రూ.63,370, బెంగళూరులో రూ.63,220, కలకత్తాలో రూ.63,220, కేరళలో రూ.63,220, వడోదరలో రూ.63,270, జైపూరులో రూ.63,370, లక్నోలో రూ.63,370, కోయంబత్తూరులో రూ.63,820, సూరత్ రూ.63,270 వద్ద కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, కడప, విశాఖ, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల ధర రూ.57,950గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.63,220 వద్ద నేడు కొనసాగుతున్నాయి. అలాగే ఏపీ, తెలంగాణలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. కేజీకి నేడు రూ.300 తగ్గి రూ.76,700 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications