Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ముగియటంతో దేశంలో బంగారం ధరలు చల్లారాయి. దీంతో గోల్డ్ షాపింగ్ చేయాలనుకుంటున్న లవర్స్ కోసం తగ్గుతున్న రేట్లు పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో అనేక మంది ఆభరణాల ఆర్డర్ పెట్టేందుకు వెళుతున్నారు.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న స్థిరంగానే కొనసాగినప్పటికీ.. నేడు స్వల్పంగా రూ.10 తగ్గాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,100, ముంబైలో రూ.57,590, దిల్లీలో రూ.57,740, కలకత్తాలో రూ.57,590, కేరళలో రూ.57,590, వడోదరలో రూ.57,640, అహ్మదాబాదులో రూ.57,640, జైపూరులో రూ.57,740, నాశిక్ లో రూ.57,620, మైసూరులో రూ.57,590, అయోధ్యలో రూ.57,740, బళ్లారిలో రూ.57,590, నోయిడాలో రూ.57,740గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నేడు రూ.10 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,380, ముంబైలో రూ.62,830, దిల్లీలో రూ.62,990, కలకత్తాలో రూ.62,830, కేరళలో రూ.62,830, వడోదరలో రూ.62,880, అహ్మదాబాదులో రూ.62,880, జైపూరులో రూ.62,990, నాశిక్ లో రూ.62,860, మైసూరులో రూ.62,830, అయోధ్యలో రూ.62,990, బళ్లారిలో రూ.62,830, నోయిడాలో రూ.62,990 వద్ద ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కడప, కాకినాడ, విశాఖ, అనంతపురం, హైదరాబాద్, నిజాంబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,590గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.62,830గా కొనసాగుతున్నాయి. ఏపీ-తెలంగాణలో వెండి నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. కేజీకి రేటు రూ.100 తగ్గిన తర్వాత రూ.75,400గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications