Gold Rate: సోమవారం శపించిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో నేడు పెరిగిన రేట్లివే..
Gold Price Today: బంగారం తగ్గితే వందల్లో పెరితే మాత్రం వేలల్లో ఉంటుంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ధోరణి ఇంకెంత కాలం ఉంటుందో అని భారతీయ పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చైనా భారీ కొనుగోళ్లు అంతర్జాతీయంగా పసిడి ధరలపై భారీగా ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సోమవారం అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలు 10 గ్రాములకు గమనిస్తే.. చెన్నైలో రూ.66,100, ముంబైలో రూ.66,050, దిల్లీలో రూ.66,200, కలకత్తాలో రూ.66,050, బెంగళూరులో రూ.66,050, కేరళలో రూ.66,050, వడోదరలో రూ.66,100, జైపూరులో రూ.66,200, లక్నోలో రూ.66,200, నాశిక్ లో రూ.66,080, అయోధ్యలో రూ.66,200, గురుగ్రాములో రూ.66,200, నోయిడాలో రూ.66,200, గోవాలో రూ.66,050 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2,200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేడు పెరిగిన తాజా రిటైల్ విక్రయ ధరలు 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.72,110, ముంబైలో రూ.72,050, దిల్లీలో రూ.72,200, కలకత్తాలో రూ.72,050, బెంగళూరులో రూ.72,050, కేరళలో రూ.72,050, వడోదరలో రూ.72,100, జైపూరులో రూ.72,200, లక్నోలో రూ.72,200, నాశిక్ లో రూ.72,080, అయోధ్యలో రూ.72,200, గురుగ్రాములో రూ.72,200, నోయిడాలో రూ.72,200, గోవాలో రూ.72,050గా విక్రయించబడుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,050 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 పెరిగి రూ.87,500 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications