బంగారం కొనడానికి ఇదే బంగారం లాంటి అవకాశం: హైదరాబాద్, విజయవాడల్లో రేట్లివీ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పసిడి రేట్లు మరోసారి క్షీణించాయి.. స్వల్పంగానే. బంగారం, వెండి ధరల్లో కొద్దిరోజులుగా నెలకొన్న క్షీణత కొనసాగుతూనే వస్తోంది. శనివారం నాడు కూడా వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. వేర్వేరు నగరాల్లో వేర్వేరు స్థాయిల్లో వాటి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం ధరలో 290 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధరలో 270 రూపాయల మేర తగ్గుదల రికార్డయింది. మిగిలిన నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.
అంతర్జాతీయ స్థాయిలో కొద్దిరోజులుగా బులియన్ మార్కట్ బలహీన పడుతోంది. బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరల పతనంతో కొనుగోళ్లు క్లోజ్ అయ్యాయి. బంగారం ఫ్యూచర్ ట్రేడ్ 212 రూపాయల మేర తగ్గి, 47,560 రూపాయల వద్ద నిలిచింది. వెండి ఫ్యూచర్ ట్రేడ్ 508 క్షీణతతో కేజీ ఒక్కింటికీ 68,710 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో తగ్గుదర కొనసాగుతూనే ఉంది.

అమెరికాలో బంగారం లావాదేవీలు 16.72 డాలర్ల మేర తగ్గి, ఒక ఔన్స్‌కు 1,777.11 వద్ద నిలిచింది. వెండి 0.55 డాలర్ల మేర తగ్గుదలతో 26.00 వద్ద నిలిచింది. శనివారం ఉదయం వేర్వేరు నగరాల్లో రికార్డయిన బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 46,570 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం 48,530 రూపాయలుగా పలికింది. వెండి కిలో ఒక్కింటికి 68,700 వద్ద నిలిచింది. బెంగళూరులో 22 క్యారెట్లు-44,790, 24 క్యారెట్లు-48,860, వెండి-68,700గా రికార్డయింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 44,940, 24 క్యారెట్లు-49,030 వద్ద నిలవగా.. వెండి 74,500లు పలికింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం-46,350, 24 క్యారెట్లు-50,570, వెండి 68,700లుగా రికార్డయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 22 క్యారెట్లకు 44,790 రూపాయలు, 24 క్యారెట్లు-48,860 రూపాయలుగా నమోదైంది. వెండి కేజీ ఒక్కింటికి 74,300 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలల్లో ఇదే రేటు కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం-45,050, 24 క్యారెట్లు 46,050గా పలకగా.. వెండి 68,700 రూపాయల వద్ద నిలిచింది.


Click it and Unblock the Notifications