Gold Price Today: పసిడి ధరలు బ్రేకుల్లోని బుల్డోజరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలో దీపావళికి షాపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్న అనేక మంది ఆందోళన చెందుతున్నారు. దనత్రయోదశి అక్టోబర్ 29న రావటంతో చాలా మంది ఎంతోకొంత గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా షాపుల యజమానులు దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ.. భారీగా పెరిగిన రేట్లు డిమాండ్ తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నారు.
MCXలో గోల్డ్, సిల్వర్ ధరలు నేడు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్ 5 ఎక్స్‌పెయిరీ ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.78,240కి చేరుకోగా, వెండి ధర కేజీకి రూ.98,224 రేటు పలుకుతోంది. ఇక అమెరికా స్పాట్ మార్కెట్లో గోల్డ్ 2725.81 డాలర్ల వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో వెండి ధరలు 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వీటికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే సమీపంలో ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒకటి కాగా, మధ్యప్రాశ్చంలో కొనసాగుతున్న ఆందోళనలు రేట్లను ప్రేరేపిస్తున్నాయి.

22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన వాస్తవ రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, వడోదరలో రూ.7305, జైపూరులో రూ.7315, లక్నోలో రూ.7315, మంగళూరులో రూ.7300, నాశిక్‌లో రూ.7303, అయోధ్యలో రూ.7315, బళ్లారిలో రూ.7300, గురుగ్రాములో రూ.7315, నోయిడాలో రూ.7315 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.2200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ వక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7979, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, వడోదరలో రూ.7969, జైపూరులో రూ.7979, లక్నోలో రూ.7979, మంగళూరులో రూ.7964, నాశిక్‌లో రూ.7967, అయోధ్యలో రూ.7979, బళ్లారిలో రూ.7964, గురుగ్రాములో రూ.7979, నోయిడాలో రూ.7979గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7964 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 పెరిగి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications