బంగారం ధర ఇంకా తగ్గుతుంది.. కొనకుండా ఓపిక పట్టండి.. గట్టి సూచన చేస్తున్న నవనీత్ దమాని
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భద్రమైన పెట్టుబడిగా ఉన్న బంగారం ధరలు ఈ మధ్య ఆకాశాన్ని తాకాయి. అయితే ఆ సుదీర్ఘ ర్యాలీకి గత మూడు రోజుల పాటు ఆకస్మికంగా బ్రేకులు పడగా నేడు మళ్లీ పెరిగాయి. రికార్డు స్థాయిలో గరిష్టాలను తాకిన పసిడి ధరలు.. పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గత మూడు రోజులు గణనీయంగా పడిపోయాయి.తాజాగా మళ్లీ పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చాయి.
తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL)లో కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాని ప్రకారం.. పెట్టుబడిదారులు తీవ్రమైన ర్యాలీ తర్వాత లాభాలను బుక్ చేసుకోవడం కొనసాగించడం వలన, బంగారం, వెండి ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశముందని సూచించారు. ఈ ఏడాది బంగారం 60 శాతం, వెండి 80 శాతం లాభాన్ని ఇస్తూ అసాధారణ ర్యాలీని ఇచ్చింది. ఇటీవలి తగ్గుదల ప్రధానంగా ఈ బలమైన పరుగు తర్వాత పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పు ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

రెండు లోహాలకు సరఫరా సమస్యలు, డిమాండ్ బలంగా కొనసాగడం, కేంద్ర బ్యాంకుల చురుకైన కొనుగోలు కొనసాగింపు ధరల స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయని ధమాని తెలిపారు.మార్కెట్ ఇప్పుడు మితిమీరిన ఉత్సాహం తర్వాత చల్లబడుతోందని అన్నారు. బంగారం ధర 4 వేల డాలర్ల నుండి 4,400 డాలర్లకు, వెండి ధర 45 డాలర్ల నుండి 55 డాలర్లకి పెరగడం మార్కెట్ పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అయితే ఇప్పుడు ఆ పెరుగుదల వీక్ అయి ధరలు తిరిగి సమతుల్య స్థాయికి చేరుకుంటున్నాయని ధమాని తెలిపారు.
ఆయన అంచనా ప్రకారం.. స్థిరీకరణకు ముందు Gold, వెండి మరో 5 నుంచి 6 శాతం తగ్గవచ్చు. బంగారం దాదాపు 3,838.50 డాలర్లకు, వెండి 44.5 నుంచి 45 డాలర్ల శ్రేణికి దిగిరావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ పెరగడం దేశీయ ధరలను మరింత తగ్గించే అవకాశం కలిగిస్తుందన్నారు.
దేశీయ మార్కెట్‌లో వెండి కిలోకు రూ.1,36,000 నుండి 1,38,000 మధ్య బలమైన మద్దతు పొందే అవకాశం ఉంది. ఇది మంచి రీ-ఎంట్రీ జోన్‌గా మారుతుంది. Gold 10 గ్రాములకు రూ.1,12,000 నుండి రూ. 1,15,000 మధ్య వినియోగదారుల కొనుగోలు ఆసక్తి పెరుగుతుంది. అంటే ఈ స్థాయిలోకి వచ్చినప్పుడు కొనుగోలు మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుత స్థాయిల కంటే దాదాపు రూ.6 వేలు నుండి రూ. 7 వేలు తక్కువ అని చెబుతున్నారు.
ఇది V-ఆకారపు రికవరీ అవ్వదు. తదుపరి రెండు త్రైమాసికాలలో సమయానుకూల దిద్దుబాట్లు, పరిమిత రాబడితో ధరలు స్థిరపడే అవకాశం ఉంది.స్వల్పకాలిక బలహీనత ఉన్నప్పటికీ, బంగారంతో పోలిస్తే వెండి మీద సానుకూల దీర్ఘకాలిక దృష్టిని ఆయన కొనసాగిస్తున్నారు. పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో తాత్కాలిక తగ్గుదల కనిపిస్తూనే ఉంది. కానీ, సరైన రకంగా అంచనా వేస్తే బంగారం, వెండి స్థిరీకరణ తరువాత తిరిగి పెరుగుదల కొరకు అవకాశాలు ఇంకా కొనసాగుతాయని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications