Gold Price Today: ఈవారం పసిడి ప్రియులకు కలిసొచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు. గతవారం పెరుగుదల తర్వాత స్థిరత్వాన్ని కొనసాగించిన గోల్డ్.. ఈవారం పతనాన్ని చూస్తోంది. ఈనెలలో రాఖీ పండుగ రానుండటంతో పాటు శ్రావణమాసం మెుదవటంతో శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం ఆభరణాలు కొనేందుకు పసిడి, వెండి ప్రియులు తగ్గిన ధరలతో షాపులకు వెళుతున్నారు. వ్యాపారులు సైతం ప్రస్తుతం పరిస్థితులతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు రూ.4,000 క్షీణతను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.6330, ముంబైలో రూ.6350, దిల్లీలో రూ.6365, కలకత్తాలో రూ.6350, బెంగళూరులో రూ.6350, కేరళలో రూ.6350, వడోదరలో రూ.6355, జైపూరులో రూ.6365, నాశిక్ లో రూ.6353, అయోధ్యలో రూ.6365, బళ్లారిలో రూ.6350, గురుగ్రాములో రూ.6365, నోయిడాలో రూ.6365 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు రూ.4,400 క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6906, ముంబైలో రూ.6927, దిల్లీలో రూ.6942, కలకత్తాలో రూ.6927, బెంగళూరులో రూ.6927, కేరళలో రూ.6927, వడోదరలో రూ.6932, జైపూరులో రూ.6942, నాశిక్ లో రూ.6930, అయోధ్యలో రూ.6942, బళ్లారిలో రూ.6927, గురుగ్రాములో రూ.6942, నోయిడాలో రూ.6942గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.6927 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.87,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications