Gold Price Today: జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు రోజు పసిడి ధరలు పడిపోవటంతో భారతీయ కొనుగోలుదారుల్లో కోలాహలం కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లపై ఫోకస్ పెట్టడంతో నేడు పసిడి ధరలు భారీగా క్షీణతను నమోదు చేశాయి.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే 4000 రూపాయల భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు దేశీయంగా తగ్గిన రిటైల్ విక్రయ ధరలు 1 గ్రాముకు వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6,666, ముంబైలో రూ.6,610, దిల్లీలో రూ.6,625, కలకత్తాలో రూ.6,610, కేరళలో రూ.6,610, పూణేలో రూ.6,610, వడోదరలో రూ.6,615 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.4,400 భారీ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7,272, ముంబైలో రూ.7,211, దిల్లీలో రూ.7,226, కలకత్తాలో రూ.7,211, కేరళలో రూ.7,211, పూణేలో రూ.7,211, వడోదరలో రూ.7,216గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,610గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,211 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.700 తగ్గి రూ.99,300 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications