అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిపుణులు అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. గ్లోబల్ కారణాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికల చుట్టూనే ఈ విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే భారతదేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే ఒక అత్యంత కీలక అంశం ఎప్పుడూ చర్చకు రావడం లేదు. అదే కస్టమ్స్ సుంకం.
కస్టమ్స్ సుంకం అనేది ప్రభుత్వం దిగుమతులు-ఎగుమతులపై విధించే పన్నుగా చెప్పవచ్చు. ఈ సుంకం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం, అలాగే దేశీయ పరిశ్రమలను రక్షించడం అని చెప్పుకోవాలి. ఇండియాలో Gold, వెండి ధరలపై కస్టమ్స్ సుంకం ప్రభావం చాలా ఎక్కువ. ఎందుకంటే దేశంలో అవసరమయ్యే బంగారాన్ని ఎక్కువగా దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉంటుంది.

ఆభరణాల తయారీకి, పెట్టుబడుల కోసం, సంప్రదాయ అవసరాల కోసం బంగారం విస్తృతంగా వినియోగంలో ఉంది. భారతదేశంలో వివాహాలు, పండుగలు, ఆచారాల్లో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత వేరే స్థాయిలో ఉంటుంది. అందువల్ల దిగుమతులపై విధించే పన్ను నేరుగా ఆభరణాల ధరలను, తద్వారా డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది.కస్టమ్స్ సుంకంలో ఏ చిన్న మార్పు జరిగినా.. అది Gold, వెండి ధరలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. సుంకం ఎక్కువైతే బంగారం ధరలు పెరగడం, సుంకం తగ్గితే పసిడి ధరలు తగ్గడం జరుగుతాయి. భారతదేశంలో స్వదేశీ బంగారం ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటంతో, ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అక్టోబర్ 2025లో దీపావళి ముందు బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో 14.72 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశంలో బంగారం డిమాండ్ ఎంత భారీగా ఉందో స్పష్టం చేస్తోంది.
కస్టమ్స్ సుంకాలపై నిర్ణయాలు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో తీసుకుంటారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో దిగుమతి-ఎగుమతి పన్నుల్లో మార్పులు ఉంటే ప్రకటిస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి 1, 2026న కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో.. బంగారం-వెండిపై ఏవైనా కొత్త నిర్ణయాలు ఉంటాయా అని పెట్టుబడిదారులు, బులియన్ మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల బడ్జెట్లను పరిశీలిస్తే.. కస్టమ్స్ సుంకాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా మారిందో స్పష్టంగా తెలుస్తుంది.
2021 బడ్జెట్‌లో అక్రమ రవాణాను అరికట్టడం, దిగుమతులను సులభతరం చేయడం లక్ష్యంగా బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. అయితే అదే సమయంలో 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC)ను ప్రవేశపెట్టారు. మొత్తంగా చూస్తే పన్ను భారం కొంత తగ్గింది.
2022 బడ్జెట్‌లో మాత్రం బంగారం, వెండిపై ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక 2023లో వెండిపై సుంకాలను పెంచుతూ, వెండి దిగుమతులపై పన్ను భారాన్ని ఎక్కువ చేశారు. అలాగే 2024 బడ్జెట్‌లో మళ్లీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు బంగారం, వెండిపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి తగ్గించారు. 2025 బడ్జెట్‌లో మాత్రం ఈ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ఇక పసిడి ధరల విషయానికి వస్తే.. గత ఆరు నెలలుగా బంగారం-వెండి నిరంతర ర్యాలీలో ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు, కరెన్సీల బలహీనత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుచూపుతున్నారు. 2026 ప్రారంభం నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి కొత్త గరిష్టాలను తాకాయి. దేశీయంగా MCXలో బంగారం, వెండి ఫ్యూచర్స్ రికార్డు ధరలకు చేరాయి.
ఏదేమైనా.. 2026 బడ్జెట్‌లో ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తే భారతదేశంలో బంగారం-వెండి ధరలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో మార్పులు బలంగా ఉన్నందున దీని ప్రభావం తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉంది. వచ్చే బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలపై నిర్ణయం తీసుకుంటే భారత బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపే కీలక అంశంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications