Gold, Silver ETF's: భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్.. పెట్టుబడులు ఇప్పుడు ఆపాలా..!

మొన్నటి వరకు భారీగా రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ లు గత వారం రోజులు తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ భారీగా పడిపోయాయి. శుక్రవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.5 వేలు తగ్గింది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ ల్లో ఒత్తిడి పెరిగింది. అటు వెండి కూడా కిలో రూ.10 వేలు తగ్గింది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ లు పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడం, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ లు పడిపోయాయి. మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ ఈటీఎఫ్, ఛాయిస్ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ లు భారీగా పడిపోయాయి. మిగతా గోల్డ్ ఈటీఎప్స్ దాదాపు 4 నుంచి 5 శాతం పడిపోయాయి.

శుక్రవారం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.5120 తగ్గి రూ.1,25,570 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 4700 తగ్గి 1,15, 100 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ.3840 తగ్గి రూ.94,180 లకు చేరింది. బంగారం జనవరిలో గరిష్ట స్థాయికి చేరకుంది. అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే నెలనెలా కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టినవారు తక్కువగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ లతో పోల్చితే సిల్వర్ ఈటీఎఫ్ లు భారీగా పడిపోయాయి.

Gold Silver ETF

సిల్వర్ ఈటీఎఫ్ ల్లో ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్ భారీగా పడిపోయింది. ఈ ఈటీఎఫ్ సుమార్ 9 శాతం వరకు తగ్గింది. నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, హెచ్డిహెఫ్సీ సిల్వర్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ లు సుమార్ 7 శాతం వరకు నష్టపోయాయి. వెండి ధరలు ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగాయి. కిలో వెండి దాదాపు రూ.4 లక్షలకు చేరింది. అప్పటి నుంచి సిల్వర్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత 10 రోజులు వెండి ధరలు పడిపోయాయి. శక్రవారం కిలో వెండి రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది. సమీప భవిష్యత్ లో వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే దీర్ఘకాలంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు వారి సిప్ ను కొనసాగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈటీఎఫ్ ల్లో ఏక మొత్తంలో కాకుండా సిప్ రూపంలో పెట్టుబడి పెడితే మంచిదని సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినప్పుడు సిప్ పెంచితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+