బంగారం ధర కుప్పకూలుతుందని భయపెడుతున్నారు.. అసలైన వాస్తవం ఇదే అంటున్న రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి ఇటీవల మరోసారి బిట్‌కాయిన్, బంగారం, వెండి పెట్టుబడులపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఆయన తాజాగా 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్)లో చేసిన పోస్ట్‌లో యూట్యూబ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లూయెన్సర్లను తీవ్రంగా విమర్శించారు. వీరు పెట్టుబడిదారుల భయాన్ని వినియోగించుకుంటూ ఫియర్ క్లిక్‌బైట్స్ ద్వారా వ్యూస్, ఫాలోవర్లు సంపాదిస్తున్నారని తెలిపారు.
కియోసాకి ట్వీట్‌లో పేర్కొన్నట్లు .. చాలా మంది యూట్యూబ్ జాకీలు పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారు. 'బిట్‌కాయిన్ క్రాష్ అవుతుంది', 'బంగారం, వెండి పడిపోతాయి' అని భయపెట్టే వీడియోలు చేస్తూ, తర్వాత 'నా వెబ్‌సైట్‌కి సబ్‌స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఇది నేరుగా ప్రజల భయాన్ని అమ్ముకునే వ్యాపారం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫియర్ క్లిక్‌బైటింగ్ అనేది ఒక కొత్త రకం మోసం. వీళ్లు నిజమైన విశ్లేషణ ఇవ్వడం లేదు, భయాన్ని పెంచి తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచుకుంటున్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రమాదకరం అంటూ మండిపడ్డారు.

ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, కియోసాకి మళ్లీ ఒకసారి నిజమైన ఆస్తులు (Real Assets) అంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథేరియం వంటి వాటిపైనే నమ్మకం ఉంచాలని సూచించారు. వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్‌కాయిన్, ఎథేరియం, Gold, వెండి ధరలు పడిపోయినా, నేను భయపడను. ఆ తగ్గిన ధరలకు మరింత కొనుగోలు చేస్తాను. ఎందుకంటే ఇది దీర్ఘకాల పెట్టుబడి అవకాశ అని తెలిపారు.
అసలు సమస్య బిట్‌కాయిన్ లేదా బంగారం కాదు. ఫేక్ మనీ అంటే అమెరికా డాలర్ వ్యవస్థ అని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు అంతా తప్పుడు డబ్బుతో వ్యవహరిస్తున్నాయి. అసమర్థ నాయకత్వం, కోట్ల కోట్ల రూపాయల అప్పు, నకిలీ కరెన్సీ వ్యవస్థ.. ఇవే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరం చేస్తున్నాయని తెలిపారు. నిజమైన విలువ ఉన్న ఆస్తులను ప్రజలు సొంతం చేసుకోవాలి. Gold, వెండి, బిట్‌కాయిన్, ఎథేరియం.. ఇవే భవిష్యత్తు డబ్బు. ప్రభుత్వాలు ముద్రించే కాగిత డబ్బు కాదని ఆయన ఎప్పటిలాగే ప్రజలకు సూచన చేస్తున్నారు.
భయంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ తాత్కాలికంగా పడిపోతే, అదే మీకు చౌకగా కొనుగోలు చేసే అవకాశం అవుతుంది. దీర్ఘకాలం ఆలోచించే వారే చివరికి గెలుస్తారనిపెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. బిట్‌కాయిన్, బంగారం, వెండి వంటి రియల్ అసెట్‌లను ఆయన ప్రోత్సహిస్తుంటారు. 2024 ప్రారంభంలో కూడా ఆయన "బిట్‌కాయిన్ $100,000 దాటుతుంది" అని అంచనా వేసి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు కూడా ఆయన అదే నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. భయాన్ని పక్కన పెట్టండి, అసలైన విలువలో పెట్టుబడి పెట్టండని చెబుతున్నారు.
క్లుప్తంగా ఆయన మాటల్లో చెప్పాలంటే.. సోషల్ మీడియా భయపెట్టే కథనాల వల్ల గందరగోళానికి లోనవ్వకండి. మార్కెట్ పడిపోవడం సహజం. కానీ భయం కాదు సమయోచిత చర్య మాత్రమే విజయం తీసుకొస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications