Gold Rate Today: పండగ తర్వాత పెరుగుతున్న పసిడి.. ఏపీ, తెలంగాణ ఇవాళ్టి రేట్లు..
Gold Rate Today: గతవారం చివర్లో కొంత తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గణేష్ చతుర్థి తర్వాత అనూహ్యంగా ధరలు ఊపందుకున్నాయి. దీంతో చాలా మంది సామాన్యులు తమ కొనుగోళ్ల నిర్ణయాలపై అయోమయంలో ఉన్నారు.
22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు దేశంలోని పలు నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,210, ముంబైలో రూ.54,950, దిల్లీలో రూ.55,100, కలకత్తాలో రూ.54,950, బెంగళూరులో రూ.54,950, కేరళలో రూ.54,950, పూణేలో రూ.54,950, అహ్మదాబాదులో రూ.55,000, జైపూర్ లో రూ.55,100, కోయంబత్తూరులో రూ.55,210, పాట్నాలో రూ.55,000, నాగపూర్ లో రూ.54,950గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరల రిటైల్ ధరలను ప్రధాన నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.60,230, ముంబైలో రూ.59,950, దిల్లీలో రూ.60,100, కలకత్తాలో రూ.59,950, బెంగళూరులో రూ.59,950, కేరళలో రూ.59,950, పూణేలో రూ.59,950, వడోదరలో రూ.60,000, అహ్మదాబాదులో రూ.60,000, జైపూర్ లో రూ.60,100, కోయంబత్తూరులో రూ.60,230, మధురైలో రూ.60,230, పాట్నాలో రూ.60,000, మంగళూరులో రూ.59,950 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, విశాఖ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల గోల్డ్ రిటైల్ ధర రూ.54,950 గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,950గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కిలోకు రూ.300 పెరగటంతో రూ.79,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications