భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, బలమైన పెట్టుబడి. ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో బంగారం ధరలు (Gold rates) చుక్కలను తాకిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి ఊరట లభిస్తుందా? లేదా కొత్త ఆంక్షలు వస్తాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు
గత బడ్జెట్ (2025) నుండి ఇప్పటివరకు బంగారం ధరలు ఏకంగా 100 శాతం పెరగడం గమనార్హం. గతేడాది ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 84,000 ఉండగా ఇప్పుడు అది రూ. 1.67 లక్షల మార్కుకు చేరుకుంది. ఇక వెండి అయితే ఏకంగా 250 శాతం లాభాలను ఇచ్చి రూ. 3.47 లక్షల (కేజీ) వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ కొత్తగా కొనాలనుకునే వారికి మాత్రం భారంగా మారింది.
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
చాలామందికి ఉండే అతిపెద్ద అనుమానం.. "ఇంట్లో ఎంత బంగారం ఉంచుకుంటే ఐటీ నోటీసులు రావు?" అని. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, సరైన ఆదాయ ఆధారాలు (Bills) ఉంటే ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ ఆధారాలు లేని పక్షంలో కొన్ని పరిమితులు ఉన్నాయి..
- వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకు.
- అవివాహిత యువతులు: 250 గ్రాముల వరకు.
- పురుషులు: 100 గ్రాముల వరకు. ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని ఆదాయపు పన్ను దాడుల సమయంలో అధికారులు జప్తు చేయరు.
బడ్జెట్ 2026: ఇన్వెస్టర్ల డిమాండ్లు ఇవే!
ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల, రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం కొంటే పాన్ (PAN) కార్డ్ చూపించాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు తులంన్నర బంగారం కొన్నా ఆ లిమిట్ దాటిపోతోంది. అందుకే ఈ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని నగల వర్తకులు కోరుతున్నారు. అలాగే, ఐటీ రిటర్న్స్‌లో బంగారం నిల్వలను వెల్లడించే ప్రక్రియను (Reporting Mechanism) మరింత కఠినతరం చేస్తారా లేదా సరళీకరిస్తారా అన్నది చూడాలి.
పన్నుల బాదుడు ఎలా ఉంది?
బంగారం కొనుగోలుపై ప్రస్తుతం 3% జీఎస్టీ (GST) వర్తిస్తుంది. ఒకవేళ మీరు పాత నగలను అమ్మి లాభం పొందితే, ఆ లాభంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) కింద 12.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ లాభాలైతే (2 ఏళ్ల లోపు) 20% వరకు పన్ను పడుతుంది. ఈ పన్ను రేట్లలో ఏవైనా మార్పులు ఉంటాయా అని మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 34,600 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇది ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే ఎక్కువ! ఇంతటి భారీ సంపద కలిగిన దేశంలో బడ్జెట్ నిర్ణయాలు ప్రతి ఒక్కరి జేబుపై ప్రభావం చూపుతాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications