బంగారం ధర ఈ రేటు వద్దకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బ్యాంక్ నిపుణులు
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుతోంది. 24 క్యారెట్లు (24K) బంగారం ధర తొలి సారిగా దేశంలో రూ.1,11,280కి చేరుకుంది. ఇక 22 క్యారెట్లు (22K) బంగారం ధర కూడా రూ. 1,02,000 కి చేరింది. 1 గ్రాము 24K బంగారం ఇప్పుడు రూ. 11,128 వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కారణంగా అంతర్జాతీయ బంగారం ధర ఒక్కో ఔన్స్‌కు 3,654 డాలర్లకి పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గించే అవకాశాలు పెరగడంతో, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో భారత మార్కెట్‌లో MCX బంగారం రూ. 1,09,656కి దగ్గరగా ట్రేడవుతోంది. ఇక ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక కిలో వెండి ధర రూ.1,32,000కి చేరింది. ఇది గత కొన్ని సంవత్సరాల్లో గరిష్ట స్థాయిగా చెప్పవచ్చు. వెండి కూడా ఇప్పుడు పెట్టుబడిదారులకు ఒక సురక్షిత పెట్టుబడి అవుతోంది.

అమెరికా లేబర్ మార్కెట్ మందగమనం, ద్రవ్యోల్బణం తగ్గిపోవడంపై సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ రేటు 75 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశాలు పెరిగాయి. CME ఫెడ్ వాచ్ టూల్ ప్రకారం, 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు 92%కి పైగా అవకాశం ఉంది. ఇవన్నీ Gold ధరలను అమాంతం పెంచుతున్నాయి. విలువైన లోహాల ETFల (Exchange Traded Funds) హోల్డింగ్స్ రెండు సంవత్సరాల్లో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వెండి ETF హోల్డింగ్స్ కూడా మూడు సంవత్సరాల్లో గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం స్పాట్ సిల్వర్ 40.60 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ఇది త్వరలో 42 నుంచి 42.45 డాలర్లకి పెరిగే అవకాశం ఉందని ICICI డైరెక్ట్ పరిశోధకులు చెబుతున్నారు. MCX సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ. 124,500ని దాటి రూ. 128,200 స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. Gold, వెండి ధరలు ఎక్కువగా పెరుగుతుండటంతో కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.చిన్న మొత్తంలోనే పెట్టుబడి చేయడం మంచిదని చెబుతున్నారు. వెంటనే కొనడం అవసరం లేదని, కొంతసేపు వేచి చూసి మరింత తక్కువ ధరలో కొనడం సురక్షిత మార్గమని సూచిస్తున్నారు.
సెబీ కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా ప్రకారం.. 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,000కి చేరవచ్చు. అందుకే, ఈ దిగుబడిని మిస్ కాకుండా తక్కువ సమయంలో కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. PruThviFinMart మనోజ్ కుమార్ జైన్ ప్రకారం.. ఇది వెండి కొనుగోలు చేయడానికి సరైన సమయం అని భావిస్తున్నారు.Mehta Equities Commodities VP రాహుల్ కలాంత్రి చెబుతూ బంగారం రూ. లక్షా 8 వేలకు దిగివచ్చినప్పుడు కొనడం ఉత్తమమని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ దగ్గర కొనుగోలు చేస్తే నష్టపోతారని తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications