GoFirst: తిరిగి ప్రారంభం కానున్న గోఫస్ట్ సేవలు.. ఈసారి ఎన్ని విమానాలు నడపనుందో..
GoFirst: స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్.. 26 ప్లేన్స్ మరియు 152 రోజువారీ విమానాలతో కార్యకలాపాలను పునఃప్రారంభించాలని యోచిస్తోంది. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకి పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకునేందుకు నిధుల కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాయి.
మే 3 నుంచి విమానాలను నిలిపివేసిన ఎయిర్‌లైన్.. కొంతమంది సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు మరియు పైలట్‌లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు 30 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం గోఫస్ట్ సిబ్బంది సుమారు 4 వేల 700 మంది ఉండగా.. వారిలో చాలా మంది నెలలో సంస్థను వీడనున్నారు.

పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి అనుమతి కోసం ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ వేచి ఉన్నట్లు సమాచారం. ఇది ఆమోదం పొందిన తర్వాత కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. రివైవల్ ప్లాన్‌పై సీనియర్ DGCA అధికారులతో ఎయిర్‌లైన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
"ఈ వారం DGCAకి అందించిన ప్రణాళిక ప్రకారం.. గో ఫస్ట్ 26 విమానాల సముదాయంతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూస్తోంది. ఈ ఫ్లీట్‌తో రోజుకు 152 విమానాలను నడపనుంది" అని సోర్సెస్ తెలిపాయి. మే 3న గ్రౌండింగ్ చేయడానికి ముందు చూస్తే ప్రతిరోజూ దాదాపు 200 విమానాలను ఎయిర్‌లైన్ నడుపుతుండేది.


Click it and Unblock the Notifications