GoFirst: గోఫస్ట్ కంపెనీకి భారీ ఊరట.. ఇంటెరిమ్ రిలీఫ్ అందించిన NCLT..
GoFirst: నేలకొరిగిన నాటి నుంచి గోఫస్ట్ వ్యాపారాన్ని రక్షించాలని వాడియా గ్రూప్ యాజమాన్యం చేయని ప్రయత్నం లేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోతాయా అనే ఉత్కంఠకు నేషనల్ లా ట్రైబ్యూనల్ ఇచ్చిన తీర్పు సమాధానంగా నిలుస్తోంది.
ప్రస్తుతం గోఫస్ట్ విమాన సంస్థ స్వచ్చంద దివాలా దరఖాస్తుపై ఎన్సీఎల్టీ తీర్పును వెలువరించింది. NCLT దివాలా పిటిషన్‌ను అంగీకరించింది. దీంతో గోఫస్ట్ కు అద్దెదారులు, రుణదాతల ద్వారా రికవరీ నుంచి మధ్యంతర ఉపశమనం లభించనుంది. తాజా తీర్పుతో లీజర్‌లు, రుణదాతల ద్వారా రికవరీ నుంచి మారటోరియం కింద GoFirst రక్షణను పొందనుంది. దీంతో కంపెనీ గోయింగ్ కన్సర్న్ గా కొనసాగనుంది.

గోఫస్ట్ యాజమాన్యం నుంచి ఉద్యోగులకు తాజా పరిస్థితులపై ఎలాంటి సమాచారం అందించకపోవటంతో దాదాపు 7000 మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. తమ భవితవ్యం ఏంటనే ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గోఫస్ట్ సంస్థలో క్యాబిన్‌క్రూ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణవి అనకాల అనే తెలుగు ఉద్యోగి తన యూట్యూబ్ ఛానల్లో వారు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తొలిసారిగా వెల్లడించారు.
కరోనా రెండు వేవ్స్ సమయంలో దాదాపు ఏడాది పాటు జీతాలు లేకుండానే జీవించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.. అది ఉద్యోగులను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలపై క్లారిటీ లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఎయిర్ లైన్ కంపెనీలో జరుగుతున్న మార్పులు, కంపెనీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆమె కొంత సమాచారాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications