Goel Food Products: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం అనేక కంపెనీలు తమ కొత్త ఆర్థిక సంవత్సరానికి మెుదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లతో పాటు డివిడెండ్ ప్రకటిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గోయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లతో పాటు డివిడెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఉచితంగా బోనస్ షేర్లను అందించేందుకు ఇన్వెస్టర్లు అర్హత పొందేందుకు రికార్డు తేదీని ప్రకటించింది. కంపెనీ షేర్ ధర ప్రస్తుతం రూ.200 ఉండగా.. ఒక్కో షేరుకు నాలుగు బోనస్ షేర్లను అందిస్తామని ప్రకటించింది. కంపెనీ మే 30న ఇచ్చిన సమాచారం ప్రకారం రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లకు 50 పైసలు చొప్పున డివిడెండ్ అందిస్తామని ప్రకటించింది.

అయితే కంపెనీ ప్రకటించిన బోనస్ షేర్లను పొందటానికి రికార్డు తేదీని జూలై 31, 2024గా ప్రకటించబడింది. దీని ప్రకారం ప్రకటించబడిన తేదీలో కంపెనీ బుక్స్ ప్రకారం షేర్లను కలిగి ఉండే ఇన్వెస్టర్లకు మాత్రమే బోనస్ షేర్ల ప్రయోజనం లభిస్తుంది. గతంలో ఎప్పుడూ కంపెనీ పెట్టుబడిదారులకు డివిడెండ్ అందించలేదు. అయితే తొలిసారిగా బోనస్ షేర్లతో పాటు డివిడెండ్ ప్రకటించటంపై ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి గోయల్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ షేర్ల ధర ఒక్కోటి రూ.163.35 వద్ద ముగిసింది. కంపెనీ షేర్ల ధరలు గత 6 నెలల్లో 11.60 శాతం పెరిగాయి. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 12.70 శాతం రాబడిని అందించాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.223.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.125.50గా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.61.59 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications