Godrej News: రెండుగా చీలిపోయిన గోద్రెజ్ గ్రూప్.. 127 ఏళ్ల తర్వాత సంచలనం..

Godrej Family: ప్రస్తుతం ఇండియాలోని చాలా ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో తర్వాతి తరం వారసులకు పగ్గాల అప్పగింత కొనసాగుతోంది. దేశంలోని పురాతనమైన వ్యాపార కుటుంబాల్లో గోద్రేజ్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ క్రమంలోనే దేశంలో తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన గోద్రెజ్ గ్రూప్ ఇప్పుడు రెండుగా విడిపోయింది.

గోద్రేజ్ గ్రూప్ వ్యాపారాలు సబ్బులు, గృహోపకరణాల తయారీ నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించి ఉన్నాయి. గ్రూప్ ప్రస్తుతం 5 వివిధ లిస్టెడ్ కంపెనీలను గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ కలిగి ఉంది. వీటిని ఆది గోద్రెజ్, అతని సోదరుడు నాదిర్ గోద్రెజ్ తమ వద్దే ఉంచుకోనున్నారు. ఇదే సమయంలో జంషెడ్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ ముంబైలోని ప్రధాన ప్రదేశాల్లో అన్‌లిస్టెడ్ గోద్రెజ్ & బాయ్స్ దాని అనుబంధ సంస్థలు, ప్రైమ్ ల్యాండ్‌లను కలిగి ఉన్నారు.

Godrej Family Business splits into 2 parts after 127 years Know latest details

గోద్రెజ్ గ్రూప్‌ను స్థాపించిన వ్యవస్థాపకుడి కుటుంబం దాదాపు 127 ఏళ్ల తర్వాత విడిపోవటంతో.. ఒక వైపు 82 ఏళ్ల ఆది గోద్రెజ్, అతని 73 ఏళ్ల సోదరుడు నాదిర్ గోద్రెజ్ ఉన్నారు. మరోవైపు 75 ఏళ్ల జంషెడ్ గోద్రెజ్, 74 ఏళ్ల స్మితా గోద్రెజ్ కృష్ణ ఉన్నారు. గోద్రెజ్ గ్రూప్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ - గోద్రెజ్ & పోయిస్, దాని అనుబంధ సంస్థలు ఏరోస్పేస్, ఏవియేషన్ నుంచి డిఫెన్స్, ఫర్నీచర్, ఐటీ సాఫ్ట్‌వేర్ వరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి.

గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ ఆగ్రోవెట్, అజ్టెక్ లైఫ్‌సైన్సెస్ ఉన్నాయి. ఇవి నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలో ముందుకు సాగుతాయి. ఆది కుమారుడు పిరోజ్షా గోద్రెజ్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మెన్‌గా ఉంటారు. ఆగస్టు 2026లో నాదిర్ పదవీ విరమణ తర్వాత కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని గోద్రెజ్ గ్రూప్ విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. వీటికి సంబంధించిన వివరాలను గోద్రేజ్ గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించింది.

వాస్తవానికి వైద్య పరికరాలను తయారు చేయడంలో విఫలమైన తర్వాత తాళాలు వేసే వ్యాపారంలో విజయం సాధించిన న్యాయవాదిగా మారిన వ్యాపారవేత్త అర్దేషిర్ గోద్రెజ్, అతని సోదరుడు పిరోజ్షా 1897లో గోద్రెజ్ గ్రూప్‌ను స్థాపించారు. అర్దేషిర్‌కు పిల్లలు లేరు. దీంతో తమ్ముడి పిల్లలకు వారసత్వం దక్కింది. పిరోజ్షాకు సోరాబ్, దోసా, బార్జోర్, నావల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+