For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: అత్యవసర సేవలకు మా విమానాలు తీసుకోండి.. గోఎయిర్

|

అత్యవసర సేవలకు, పౌరులను చేరవేసేందుకు తమ విమానాలతో పాటు కాక్‌పిట్ క్యాబిన్ క్రూ సిబ్బందిని కూడా ఉపయోగించుకోవచ్చునని గోఎయిర్ సంస్థ పౌర విమానయాన శాఖకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లకు గురువారం లేఖ రాసింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో 650కి పైగా విమానాలు నిలిచిపోయాయి. ఇందులో గోఎయిర్‌కు 55 విమానాలు, 5,500 మంది సిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వం తరఫున షిప్ కార్గోకు సిద్ధమని తెలిపింది. అవసరమైన మందులు, అత్యవసరమైన మందులు, ఆహార ధాన్యాలు, ఇతర వస్తువుల సరఫరాకు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. అలాగే అత్యవసర సేవలు నిర్వర్తించే డాక్టర్స్, నర్సులు, పారామెడిక్స్, రిలీఫ్ వర్కర్స్ కోసం కూడా తమ సేవలు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

Covid-19: GoAir ఉద్యోగుల ఉద్యోగులకు షాక్, శాలరీలో కోత, 24 రోజులు పని చేసినా...Covid-19: GoAir ఉద్యోగుల ఉద్యోగులకు షాక్, శాలరీలో కోత, 24 రోజులు పని చేసినా...

GoAir offers its aircraft, pilots , crew and airport staff to carry out emergency services

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడం కోసం, మన దేశంలో చిక్కుకుపోయిన వారిని ఇతర దేశాలకు పంపించడం కోసం, మన రాష్ట్రాల్లోని, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పౌరులను వారి వారి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

English summary

Covid 19: అత్యవసర సేవలకు మా విమానాలు తీసుకోండి.. గోఎయిర్ | GoAir offers its aircraft, pilots , crew and airport staff to carry out emergency services

GoAir writes to the Government, offers its aircraft, pilots, cabin crew and airport staff to carry out emergency services and repatriation of citizens.
Story first published: Friday, March 27, 2020, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X