Go First: ఆర్థిక ఇబ్బందులతో సేవలను అకస్మాత్తుగా నిలిపివేసిన గోఫస్ట్ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కంపెనీకి NCLTలో సానుకూలంగా తీర్పు వచ్చింది.
రానున్న ఐదు నెలల పాటు అంటే నవంబర్ వరకు కార్యకలాపాలను పునరుద్ధరించడానికి వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ గో ఫస్ట్ సోమవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు వెల్లడించింది. 22 విమానాలతో సేవలను పునఃప్రారంభించేందుకు తమను అనుమతించాలని కోరింది. మిలిటరీ చార్టర్ విమానాలు, వాణిజ్య విమానాలతో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం కంపెనీ వద్ద 340 మంది పైలట్లు, 680 మంది క్యాబిన్ సిబ్బంది, 530 మంది ఇంజనీర్లు ఉన్నట్లు DGCAకి తెలిపింది. కంపెనీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రూ.12 కోట్లు అవసరమని, ఏప్రిల్ చివరి వారంలో ఎయిర్‌లైన్‌లో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టామని ఎయిర్‌లైన్ తన వ్యాపార ప్రణాళికలో పేర్కొంది. గత నెలలో దివాలా కోసం దాఖలు చేసిన సంస్థ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు రూ.200 కోట్లు అవసరమని పేర్కొంది.
కేంద్రం అందించే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ECLGS) కింద రూ.400 కోట్ల నిధులు, అన్‌డ్రాడ్ క్రెడిట్‌కు యాక్సెస్ ఉందని గో ఫస్ట్ తెలిపింది. గో ఫస్ట్ కూడా రూ.200 కోట్ మధ్యంతర నిధులను ఏర్పాటు చేసేందుకు రుణదాతలతో చర్చలు జరుపుతోంది. తాజాగా సమీకరిస్తున్న నిధులను కంపెనీ ఏప్రిల్, మే నెల జీతాల చెల్లింపులకు, వెండార్ పేమెంట్స్ చేసేందుకు ఉపయోగించాలని చూస్తోంది. ఫ్లయింగ్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత స్థిరమైన నగదు ప్రవాహం ఉంటుందని సీనియర్ గో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించింది. జూలై నుంచి లీజు అద్దె, నిర్వహణ నిల్వలను చెల్లించాలని ఎయిర్‌లైన్ కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications