Go First: ఆందోళనలో 5000 మంది ఉద్యోగులు.. విదేశాల్లో నిలిచిపోయిన గో ఫస్ట్ సిబ్బంది..!
Go First: గోఫస్ట్ విమాన సంస్థ కుప్పకూలటం ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే క్రమంలో స్పందించిన ఇంజిన్ సప్లయర్ ప్రాట్ అండ్ విట్నీ గోఫస్ట్ ఆరోపణలను ఖండించింది. గో ఫస్ట్‌కి సంబంధించిన మార్చి 2023 మధ్యవర్తిత్వ తీర్పును P&W పాటిస్తోందని.. అయితే ఆర్థిక బాధ్యతలను కోల్పోయిన సుదీర్ఘ చరిత్ర విమాన సంస్థకు ఉందంటూ బదులిచ్చింది.
మే 5 వరకు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ నిన్న అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటి అనే అంశంపై సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం అటు కస్టమర్లకు, ఇటు ఉద్యోగులకు లేదు. కంపెనీ నుంచి సరైన సమాచారం రావటం లేదని కొందరు ఉద్యోగులు వెల్లడించారు.

అర్థాంతరంగా కంపెనీ దివాలా ప్రకటనను వెలువరించింది. దీంతో విమానయాన సంస్థ గో ఫస్ట్ ఉద్యోగులు భారతదేశంలో, విదేశాల్లో అనేక ప్రదేశాల్లో చిక్కుకుపోయారని తెలుస్తోంది. మే 3-మే 5 వరకు విమానాలు టేకాఫ్ కావాల్సిన ప్రదేశాల్లో క్యాబిన్ సిబ్బంది, పైలట్లు చిక్కుకుపోయారని సమాచారం. ఈ క్రమంలో అబుదాబి, ఫుకెట్, కువైట్ వంటి ప్రాంతాల్లో బడ్జెట్ క్యారియర్ ఉద్యోగులు నిలిచిపోయారు. అయితే బయటకు వెళ్లేందుకు అనుమతి లేనందున విదేశాల్లో చిక్కుకున్న ఉద్యోగులు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఓనర్ వాడియా గ్రూప్ పూర్తిగా ఎయిర్‌లైన్స్‌కు కట్టుబడి ఉందని.. గో ఫస్ట్ నుంచి నిష్క్రమించే ప్రశ్నే లేదని గో ఫస్ట్ సీఈవో కౌశిక్ ఖోనా చెప్పారు. తాము రుణదాతలతో పాటు.. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే మే 15 వరకు టిక్కెట్లను విక్రయించటం లేదని రాయటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టిక్కెట్ల రద్దు చేయటంపై విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు పంపాలని DGCA నిర్ణయించింది.


Click it and Unblock the Notifications