Go First Flights: ఆఫర్స్ అంటే ఇలా ఉండాలి.. Free ఫుడ్, Free సీట్ సెలక్షన్.. ఇంకా గిఫ్టులు కూడా..
Go First Flights: ఈ మధ్య కాలంలో విమానయాన సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా.. Go First కంపెనీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దీనికి ఫ్రీడమ్ ఆఫర్ అని పేరు పెట్టింది.
ప్రయాణికులకు అనేక ఉచితాలు..
సెలవులు, పండుగలు ఉండే ఆగస్ట్ నెలలో అనేక మంది ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకునేందుకు ఈ ఆఫర్ ఉపకరిస్తుంది. ఈనెలాఖరు నుంచి వచ్చేనెల చివరి వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి ఉచిత మైళ్లతో పాటు ఉచిత సీటు ఎంపిక కూడా అందుబాటులో ఉంది. అంటే.. ప్రయాణీకుడు తన ఎంపిక ప్రకారం తనకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. దీని కోసం వారు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని పరిమిత విమానాల్లో మాత్రమే ప్రయాణికులకు ఈ సౌకర్యం లభిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు ఉచితంగా ఆహారాన్ని కూడా అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఆఫర్ వివరాలు ఇలా..
ఎయిర్‌లైన్ తన ట్వీట్‌లో మీరు ఎంతకాలం ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంటుందనే వివరాలను వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్టు 30 వరకు బుకింగ్ వ్యవధిని ఇచ్చింది. అంటే.. ఆగస్టు 30 వరకు మీరు విమానాలను బుక్ చేసుకోవచ్చు. అలాగే.. దీని ప్రయాణ వ్యవధి జూలై 25 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఫ్రీ సీటు ఎంపిక మంగళవారం, బుధవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

విమాన ప్రయాణ మార్గాలు..
పరిమిత విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ముంబై, అహ్మదాబాద్, పూణేకు వెళ్లే విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా రానున్న రోజుల్లో ఈ నగరాలకు ప్రయాణాలు చేసేందుకు సిద్ధమౌతున్నట్లయితే.. ఈ ఆఫర్ ను తప్పక వినియోగించుకోండి. ఉచిత ఆహారం, సీటు ఎంపికలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షనలుగా ఉన్నాయి. కపుల్స్ జర్నీలకు గిఫ్టులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications