రొబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించిన GMR ఇన్నోవెక్స్.. ప్రత్యేకతలు ఇవే..!
అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడిన GMR గ్రూప్ ఇటీవల GMR ఇన్నోవెక్స్ విస్తరణలో భాగంగా రోబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రారంభించింది.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ రంగంలో ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, సహకారాలకు కేంద్రంగా ఉంటుంది. ఇది రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఇంక్యుబేట్ చేసి, విమానాశ్రయ, విమానయాన రంగం కోసం వినూత్నమైన రోబోటిక్ ఉత్పత్తుల అభివృద్ధికి సహకరిస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించి.. అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. రోబోటిక్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోబోటిక్ ల్యాబ్, ఆలోచనా నాయకత్వాన్ని, పరిశ్రమ భాగస్వాములతో సహకారం అందించి.. నైపుణ్యాన్ని పెంచడం, స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం చేస్తోంది.

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిష్కారాలతో ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా వివిధ పరిశ్రమలను ఆకర్షిస్తోందని జయేష్ రంజన్ అన్నారు. ఈ దిశగా మరిన్ని పెట్టుబడులు, నిపుణులు, ఆవిష్కరణలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సాంకేతికతను వ్యాపారాన్ని సులభతరం చేయడం, మౌలిక సదుపాయాల మద్దతు, పరిశోధన తదితర అంశాల్లో ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో GMR ఇన్నోవెక్స్ ముందుంటూ తెలంగాణలో కీలకమైన టెక్ హబ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

విమానాశ్రయం, ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోబోటిక్స్ COE అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యాలను పెంచే పరిష్కారాలను అందిస్తుందని SGK కిషోర్ అభిప్రాయపడ్డారు. తాము కొత్త సాంకేతికతను గ్రూప్ అంతటా వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచటంలో వినియోగించి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications