Bhogapuram Airport నిర్మాణంలో జీఎంఆర్ దూకుడు.. రూ.3,125 కోట్లు సిద్ధం..
GMR Airports: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే పనిలో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ వేగంగా ముందుకు సాగుతోంది. విశాఖపట్నానికి దగ్గరలో దీనిని కొత్తగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
విమానాశ్రయ నిర్మాణం కోసం జీఎంఆర్ గ్రూప్ రూ.3,125 కోట్లను భోగాపురం విమానాశ్రయ కోసం ఐదుగురు రుణదాతల నుంచి సమీకరించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. ఈ సొమ్మును GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) ద్వారా సేకరించబడింది. ఏటా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేందుకు వీలుగా మెుదటి దశలో జరిపే నిర్మాణాలకు ఈ సొమ్మును కంపెనీ వినియోగించాలని నిర్ణయించింది.

జీఎంఆర్ రుణాన్ని 18 ఏళ్ల కాలానికి తీసుకోగా.. ఇందులో మూడేళ్ల నిర్మాణ దశ, ఒక సంవత్సరం స్థిరీకరణ దశ, చివరగా 14 సంవత్సరాల నిర్మాణాత్మక రీపేమెంట్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫైనాన్సింగ్ ఒప్పందాల అమలుతో, GVIAL ఈ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చడానికి అవసరమైన రుణాన్ని పొందింది.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,727 కోట్లుగా ఉండగా.. రాయితీ నిబంధనలో భాగంగా రూ.134.55 కోట్ల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రీయింబర్స్ చేస్తుంది. అయితే మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, కంపల్సరీ కన్వర్టిబుల్ డిబెంచర్లు, సబ్ డెట్‌తో పాటు ఇతర సాధనాల ద్వారా సేకరించబడుతుందని కంపెనీ వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు GQG పార్టనర్స్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా GMR ఎయిర్‌పోర్ట్స్‌లో 4.7 శాతం వాటాను రూ.1,672 కోట్లకు కొనుగోలు చేసిన ఒక రోజు తర్వాత తాజా ప్రకటన వచ్చింది.


Click it and Unblock the Notifications