Free Shares: కొత్త సంవత్సరం బోనస్ షేర్లిస్తున్న 2 కంపెనీలు.. మీ దగ్గర ఉన్నాయా..?
Bonus Shares: కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్ సోమవారం ప్రారంభం కానుంది. అయితే ఈ తొలివారంలోనే రెండు కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించాయి. రికార్డు తేదీలను కూడా ప్రకటించాయి. అసలు వీటిని పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీఎం పాలీప్లాస్ట్ లిమిటెడ్..
ముందుగా బోనస్ షేర్లను ఇచ్చే కంపెనీల్లో స్మాల్ క్యాప్ కంపెనీ అయిన GM Polyplast Ltd గురించి తెలుసుకుందాం. గత ఏడాది ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించిన కంపెనీ తాజాగా నూతన సంవత్సరంలో బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్హలైన ప్రతి ఇన్వెస్టర్ ఒక్కో షేర్ కలిగి ఉన్నందుకు 6 షేర్లను ఉచితంగా పొందుతారు. గత నెలలో స్టాక్ ధర దాదాపు 40 శాతానికి పైగా పెరిగింది. 6 నెలల కిందట కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కంపెనీ 400 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ రూ.1,221.80 ధర వద్ద ముగిసింది.

రామ స్టీల్ ట్యూబ్స్..
1974 ప్రారంభమై 50 ఏళ్ల చరిత్ర కలిగిన రామ స్టీల్ ట్యూబ్స్ షేర్ కొన్ని నెలలుగా క్షీణిస్తోంది. అయితే ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై నాలుగు ఉచిత బోనస్ షేర్లను అందించాలని నిర్ణయించింది. గడచిన నెలలో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ధర 3.19 సాతం క్షీణించింది. 6 నెలల క్రితం కంపెనీ షేర్లపై విశ్వాసం వ్యక్తం చేసిన పెట్టుబడిదారుడికి 117 శాతం కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది. 2022 చివరి ట్రేడింగ్ డే రోజున కంపెనీ స్టాక్ ధర రూ.166.75 వద్ద ముగిసింది. బోనస్ షేర్లను పొందటానికి జనవరి 6, 2023ను రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications