GM Breweries: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు బలహీనంగా కొనసాగుతున్నప్పటికీ స్మాల్ క్యాప్ లిక్కర్ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు కిక్ ఇస్తోంది. కంపెనీ వరుసగా నాలుగో సారి షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లను ప్రకటించటంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దాసుకుపోతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జీఎం బ్రూవరీస్ కంపెనీ గురించే. చిన్న లిక్కర్ తయారీ సంస్థ తన పెట్టుబడిదారులకు భారీ బహుమతిని సిద్ధం చేసింది. తాజాగా అర్హులైన ఇన్వెస్టర్లకు బోనస్ రూపంలో ఉచిత షేర్లను అందించాలని చూస్తోంది. GM బ్రూవరీస్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం మే 27న నిర్వహించనున్న డైరెక్టర్ల బోర్డు సమావేశంలో బోనస్ షేర్ల కేటాయింపును పరిశీలించి ఆమోదించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో నేడు కంపెనీ షేర్ల ధర రూ.765 స్థాయికి చేరుకున్నాయి.

కంపెనీ తన ఇన్వెస్టర్లకు నాలుగోసారి బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వబోతోంది. దీనికి ముందు మద్యం కంపెనీ మే 2014లో 1:4 నిష్పత్తిలో తన వాటాదారులకు బోనస్ షేర్లను అందించింది. అప్పట్లో కంపెనీ ప్రతి 4 షేర్లకు 1 బోనస్ షేర్‌ని బహుమతిగా ఇచ్చింది. దీని తర్వాత 2016లో 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించగా.. చివరిగా మూడోసారి మే 2018లో కంపెనీ తన పెట్టుబడిదారులకు 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అయితే తాజాగా కంపెనీ మరోసారి అర్హులైన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించనున్నట్లు సమాచారం.
గడచిన ఏడాది కాలంలో జీఎం బ్రూవరీస్ షేర్లు 35% కంటే ఎక్కువ పెరిగాయి. మే 15, 2023న రూ.569.30 వద్ద ఉన్న కంపెనీ షేర్ ధర మే 13, 2024 నాటికి పెరిగి రూ.765 స్థాయికి చేరుకుంది. కంపెనీ షేర్లు గడచిన 6 నెలల్లో 15% కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే బీఎస్ఈలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.825గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.548.65గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.1,370 కోట్లుగా ఉంది. కంపెనీలో ప్రమోటర్లు అత్యధికంగా 74.43 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications