Bonus Dhamaka: ఒక్కో షేరుకు రూ.50 డివిడెండ్.. ఫ్రీ షేర్లు కూడా.. ఈ స్టాక్ మీ దగ్గర ఉందా..?
Bonus Dhamaka: జ్యూట్, జ్యూట్ ఉత్పత్తులను తయారు చేసే గ్లోస్టర్ లిమిటెడ్ అనే సంస్థ తన ఇన్వెస్టర్లకు డబుల్ గిఫ్ట్ ఇస్తోంది. కంపెనీ ప్రతి షేరుపై ఇన్వెస్టర్లకు 500 శాతం అంటే రూ.50 మధ్యంతర డివిడెండ్ ఇవ్వబోతోంది. గ్లోస్టర్ లిమిటెడ్ షేర్లు ఈరోజు ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడవుతున్నాయి. గ్లోస్టర్ లిమిటెడ్ మధ్యంతర డివిడెండ్ రికార్డు తేదీని నవంబర్ 16, 2022గా నిర్ణయించింది. కంపెనీ డివిడెండ్ చెల్లింపును 30 నవంబర్ 2022న లేదా అంతకు ముందే జరగవచ్చు.
డివిడెండ్ ఆదాయంతో పాటు కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందిస్తోంది. గ్లోస్టర్ లిమిటెడ్ తన పెట్టుబడిదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందిస్తోంది. అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు మరో షేర్ ఉచితంగా అందిస్తోంది. టెక్స్‌టైల్ కంపెనీ బోనస్ షేర్ల రికార్డు తేదీని ఇంకా నిర్ణయించలేదు. గతంలో గ్లోస్టర్ లిమిటెడ్ ఒక్కో షేరుకు రూ.10 ప్రత్యేక డివిడెండ్, రూ.25 డివిడెండ్ చెల్లించింది.

Gloster Ltd షేర్లు గత నెలలో దాదాపు 57% లాభపడ్డాయి. 17 అక్టోబర్ 2022న BSEలో కంపెనీ షేర్లు రూ.1135.85 స్థాయిలో ఉన్నాయి. నవంబర్ 15, 2022 నాటికి షేర్ ధర రూ.1781కి చేరుకుంది. Gloster Ltd షేర్లు గత 6 నెలల్లో 87% లాభపడ్డాయి. అదే సమయంలో ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేర్లు దాదాపు 66% పెరిగాయి. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1830 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.905.80గా ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నందున ముందుగా ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications