జనవరి 2026లో బంగారం ధరలు ఔన్సుకు 5,300 డాలర్లు నుంచి 5,500 డాలర్లు దాటడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రపంచ మార్కెట్లలో విశ్లేషకులు, బ్రోకర్లు దీన్ని అత్యంత బలమైన ర్యాలీగా చూస్తున్నారు. అయితే ఈ ర్యాలీ సాధారణ లాభం కోసం కాదు. ఇది ఓ భయంతో కూడినట్లుగా కనిపిస్తోంది. అనిశ్చితితో పాటుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న అపనమ్మకంతో ముడిపడిన సంకేతంగా చూస్తున్నారు.
ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే బంగారం రికార్డు ధర పెద్ద హెచ్చరిక సంకేతాన్ని ఇస్తోంది. ప్రపంచం కొత్త మాంద్యం అంచున ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. US డాలర్ బలహీనపడడం, బాండ్లపై విశ్వాసం తగ్గడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులకు పరావస్తు కావడం ఈ Gold ర్యాలీ వెనుక ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

గత రెండు రోజులుగా ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. జపనీస్ యెన్ అకస్మాత్తుగా బలపడటం, ఇరాన్‌పై ఉద్రిక్తతలు పెరగడం, US యుద్ధ నౌకలు గల్ఫ్ వైపు తరలించడం పెట్టుబడిదారుల భయాన్ని పెంచింది. అంతేకాక నిశ్ఛబ్దంగా ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులు హార్డ్ ఆస్తులవైపు పరావస్తు అవుతున్నారు.
స్పాట్ బంగారం జనవరి 28న ఔన్సుకు 5,500 డాలర్లను అధిగమించింది. వెండి కూడా 50 శాతానికి పైగా పెరిగింది. ఇది ఒక క్లాసిక్ సంక్షోభ ర్యాలీగా పరిగణించబడుతుంది. సంక్షోభ సమయంలో భద్రతా ఆస్తులకు రాబడి కోసం పెట్టుబడిదారులు వెళ్ళే విధానంగా చూస్తున్నారు. అయితే, ఈసారి ర్యాలీ కేవలం US డాలర్ బలహీనతకు మాత్రమే సంబంధించి లేదు.. ఫెడ్ పాలసీ, US రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్ల అంచనాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఈ ర్యాలీకి మరో ప్రధాన కారణం జపనీస్ యెన్ బలపడటం. Japanలో వడ్డీ రేట్ల పెరుగుదల భయం, క్యారీ ట్రేడ్ తిరిగి రావడం, సురక్షిత ఆస్తుల వైపు ఫ్లోను పెంచింది. ఫలితంగా, పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు మాత్రమే కాకుండా.. పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు కూడా బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు కేవలం ఆస్తి విలువ కోసం కాదు, వ్యవస్థాగత ప్రమాదం, సంక్షోభం, ప్రపంచ ఆర్థిక లోతైన పగుళ్లను ప్రతిబింబించే హెచ్చరికగా కూడా పనిచేస్తున్నాయి. ఈ ర్యాలీకి భవిష్యత్తు ఇంకా అనిశ్చితమేనని చెప్పవచ్చు. వచ్చే 30 నుంచి 60 రోజుల్లో బంగారం ధరల పీక్స్ స్థాయిలు ముగియవచ్చా లేదా భయంతో కూడిన ఆర్థిక అస్థిరత మధ్య దీర్ఘకాలిక వృద్ధి ప్రారంభమవుతుందా అనేది నిర్ణయించబడుతుంది.
ప్రధాన బ్రోకరేజీలు అయిన UBS, నౌమ్రా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలు పలు సూచనలను సూచిస్తున్నాయి. బంగారం ధరల రికార్డులు, పెట్టుబడిదారుల వ్యూహాలు, భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే అంశాలపై దృష్టి సారించాలి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బంగారం, వెండి ఇప్పుడు కేవలం పెట్టుబడులకోసం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెడ్జ్ సాధనాలుగా మారాయని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications