S&P Global: మోదీ పాలనలో కేవలం దశాబ్ధ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంది. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజాల్లో తన స్థాయిని మరింతగా బలపరుచుకుంటోంది.
2024లో కూడా మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తుందనే నిపుణుల అంచనాల మధ్య మోదీ సర్కారు రాకపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ గ్లోబర్ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ తాజాగా భారత ఆర్థిక వ్యవస్థపై తన రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 2030 నాటికి ఇండియన్ ఎకానమీ ప్రపంచంలో మూడో అతిపెద్దదిగా మారుతుందని పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

ఈ క్రమంలో భారత్ తన వేగవంతమైన ప్రయాణంలో జపాన్, జర్మనీలను వెనక్కు నెడుతుందని S&P గ్లోబల్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి, 2026-27లో 7 శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది.
అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్న దేశాల జీడీపీని పరిశీలిస్తే.. అమెరికా జీడీపీ ప్రస్తుతం 25.5 ట్రిలియన్ డాలర్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది ప్రపంచ GDPలో నాలుగింట ఒక వంతు(17.9 శాతం) ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండవ స్థానంలో కొనసాగుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్ డాలర్లు జీటీపీని కలిగి ఉంది. మూడో స్థానంలో ఉన్న జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలో ఉన్న జర్మనీ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే ఐదో స్థానంలో ఉన్న ఇండియా.. తదుపరి అతిపెద్ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడం భారత్‌కు అతిపెద్ద సవాలని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం సర్వీస్ రంగంలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ తయారీ రంగంలో కీలకంగా మారాలంటే అందుకు బలమైన లాజిస్టిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం అవసరమని రేటింగ్ సంస్థ పేర్కొంది. దీనికి తోడు ఎక్కువగా వర్కర్లను నైపుణ్యం పెంపొందించడం, శ్రామికశక్తిలో స్త్రీ భాగస్వామ్యాన్ని పెంచడం కీలకమని అభిప్రాయపడింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications