గ్లోబల్ మార్కెట్‌కు అదే జోష్, పెరిగిన చమురు ధరలు: డాలర్ బలహీనం
కరోనా మహమ్మారిపై అమెరికా, భారత్, చైనా, యూరోపియన్ దేశాలు తీసుకుంటున్న చర్యలు, ఆర్థిక ప్యాకేజీల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలు నమోదు చేశాయి. సోమవారం కూడా లాభాలు చూసి వరుసగా రెండు రోజులు లాభాలు చవిచూశాయి. ఈ ప్రభావం ఆసియా, భారత మార్కెట్లపై కూడా ఉంటుంది.

పెరిగిన క్రూడాయిల్ ధరలు
చమురు ధరలు తగ్గుతాయనుకుంటే పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల యుద్ధం నేపథ్యంలో తగ్గుతాయనుకుంటే పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ 72 సెంట్లు (2.3 శాతం) పెరిగి బ్యారెల్ 32.59 డాలర్లకు చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాక్స్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ 1.30 డాలర్లు (5.5 శాతం) పెరిగి 24.93 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో ఈ ధరలు వరుసగా 3.6 శాతం, 9.4 శాతం తగ్గాయి.

జపాన్‌కు మార్కెట్లకు భారీ ప్యాకేజీ ఉత్సాహం
మార్కెట్ విషయానికి వస్తే జపాన్ నిక్కీ 2 శాతం లాభపడింది. ఎందుకంటే 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లాభాలతో దూసుకెళ్లింది. ప్రభుత్వం ప్రకటిస్తానని చెప్పిన ప్యాకేజీ జపాన్ GDPలో ఐదో వంతు కావడం గమనార్హం.

అమెరికా మార్కెట్ దూకుడు
డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 506.01 పాయింట్లు (2.23 శాతం) ఎగిసి 23,186 పాయింట్లకు, S&P 500 సూచీ 45.28 పాయింట్లు (1.70%) ఎగిసి 2,708.96కు చేరుకుంది. నాస్‌డాక్ 64.89 పాయింట్లు ( 0.82%) పెరిగి 7,978.13కుచేరుకుంది. ట్రంప్ కూడా మెడిసిన్ సహా వివిధ చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ప్రధాని మోడీతో మాట్లాడారు.

డాలర్ బలహీనం
పాన్ యూరోపియన్ స్టాక్స్ 600 సూచీ 1.55 శాతం ఎగిసింది. జపాన్ నిక్కీ 2.01 శాతం లాభపడింది. ఆసియా పసిఫిక్ 2.7 శాతం లాభపడింది. ఇక ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం 0.675 శాతం పడిపోయింది. యూరో 0.83 శాతం, జపానీస్ యెన్ 0.17 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications