Mark Mobius: భారత మార్కెట్లపై ప్రముఖ ఇన్వెస్టర్ నమ్మకం.. రానున్న ఐదేళ్లలో..
Mark Mobius: ప్రస్తుతం ఏం నడుస్తుందంటే.. అంతర్జాతీయంగా భారత మార్కెట్లపై ఇన్వెస్టర్ల నమ్మకం పెరగటం నడుస్తోంది. అవును ఇటీవల వస్తున్న అనేక నివేదికలతో పాటుగా తాజాగా ప్రఖ్యాత ఇన్వెస్టర్ దేశీయ స్టాక్ మార్కెట్లపై తన నమ్మకాన్ని ప్రకటించారు.
భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో.. బెంచ్ మార్క్ సూచీలు రికార్డు గరిష్ఠాల నుంచి కిందకు వస్తున్నాయి. అయితే రానున్న ఐదేళ్ల కాలంలో సెన్సెక్స్ సూచీ 1,00,000 మార్కును అధిగమిస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ చెప్పారు. మార్కెట్లు ఈ రికార్డులను చేరుకునే క్రమంలో కరెక్షన్స్ ఉంటాయని తాను భావిస్తున్నట్లు మోబియస్ మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వెల్లడించారు.

మార్కెట్లలో కరెక్షన్ వచ్చి పడిపోయినప్పుడు తాను ఇష్టపడతానని మెుబియల్ అన్నారు. దీనివల్ల మార్కెట్లలో మంచి షేర్లను చౌకగా కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి అవకాశాల కోసమే తాను డబ్బును రెడీ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మెుబియస్ పెట్టుబడి సంస్థ Mobius క్యాపిటల్ భాగస్వాములు ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరోనా సమయంలో అనేక మార్కెట్లు పతనం కారణంగా అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నట్లు వెల్లడించారు.
గతాన్ని పరిశీలిస్తే బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2020 మార్చిలో 47,751.33 వద్ద ముగిసే ముందు 25,638.90 కనిష్ఠాన్ని తాకింది. భారతదేశంలోని జనాభా, వైవిధ్యం, అనేక భాషలు మాట్లాడే వ్యక్తులు, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న యువ జనాభా వంటి సానుకూల కారణాల వల్ల ఇక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో తమ పోర్ట్ ఫోలియోలో భారతదేశం రెండవ అతిపెద్దదిగా ఉన్నట్లు మెుబియస్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications