Reliance: ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాలను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL). ఇది కొత్త వ్యాపారాలకు పెట్టుబడులను సమకూరుస్తుంది.
అయితే తాజాగా ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ KKR రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలో తన పెట్టుబడులను 1.42 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా రూ.2,069.50 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించినట్లు సెప్టెంబర్ 11న ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్మెంట్‌తో RRVL ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ.8.361 లక్షల కోట్లకు చేరుకోనుంది. అదే జరిగితే కంపెనీ దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలుస్తుంది.

2020లో కేకేఆర్ సంస్థ ఆర్‌ఆర్‌విఎల్‌లో రూ.5,550 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ లెక్కన తాజా పెట్టుబడులను కలుపుకుంటే మెుత్తం ఈక్విటీ హోల్డింగ్ 1.42 శాతానికి చేరుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ RRVL ద్వారా 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.47,265 కోట్ల నిధుల సమీకరణ రౌండ్ రూ.4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీతో జరిగింది. KKR పెట్టుబడి ప్రధానంగా దాని ఆసియా ఫండ్ IV నుంచి వస్తోంది. 1976లో స్థాపించబడిన KKR జూన్ 30, 2023 నాటికి 519 బిలియన్ డాలర్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కలిగి ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ ఆర్మ్ RRVL, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్‌ల ద్వారా భారతదేశపు అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది ప్రస్తుతం 26.7 కోట్ల మంది వినియోగదారులకు 18,500 దుకాణాలు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కిరాణా, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & జీవనశైలి, ఫార్మా కేటగిరీల్లో సేవలందిస్తోంది. కేకేఆర్ కు RRVLలో పెట్టుబడితో పాటు, రిలయన్స్ టెలికాం విభాగం Jioలో కూడా పెట్టుబడులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications