Gold: భూమి మీద ఉన్న బంగారం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో చూడండి! అన్నీ వివరాలు ఒకే చోట!

వేల సంవత్సరాలుగా బంగారం(gold) చాలా విలువైన సంపదగా ఉంటూ వస్తోంది. అలంకారమైన ఆభరణాల నుంచి దేశాలు దాచిపెట్టుకునే వాల్ట్ ల వరకూ.. బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో ఎంత gold ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భూమి మీద ఉన్న బంగారాన్ని మొత్తాన్ని ఒకే ఫ్రేమ్ లో గ్రాఫికల్ గా డిజైన్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ పోస్ట్ 'విజువల్ క్యాపిటలిస్ట్ (visualcapitalist.com)' అనే సైట్ లో పోస్ట్ అయింది. ఈ పోస్ట్ లోని వివరాలు ఇప్పుడు మనమూ చూద్దాం.

భూమి పైన బంగారం (Above-Ground Gold)

మనం ఇప్పటి వరకూ తవ్వి తీసిన బంగారాన్ని 'ఉపరితలంపై ఉన్న బంగారం' (Above-Ground Gold) అని అనొచ్చు. దీని మొత్తం పరిమాణం 2,16,265 టన్నులు. ఈ gold ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగు ప్రధాన విభాగాలలో చలామణి అవుతోంది.

1. ఆభరణాలు (Jewelry) : ప్రపంచంలో ఉన్న బంగారంలో అత్యధిక భాగం ఆభరణాల రూపంలోనే ఉంది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు 97,149 టన్నుల బంగారం నెక్లెస్‌లు, ఉంగరాలు, గాజులు, ఇతర అలంకరణల రూపంలో ధరించబడుతోంది.

2. బార్లు, నాణేలు (Bars & Coins) : ఇక రెండో వంతు బంగారం బార్లు, నాణేల రూపంలో ఉంది. ఆర్థిక అనిశ్చితి లేదా సంక్షోభ సమయాల్లో స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులు ఎక్కువగా ఈ బంగారాన్ని కొంటుంటారు. ఈ బంగారం మొత్తం 48,634 టన్నులు ఉంది.

3. సెంట్రల్ బ్యాంక్ నిల్వలు (Central Banks): ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇంకా బంగారు నిల్వల(gold reserves)పై ఆధారపడుతున్నాయి. ఇలాంటి నిల్వలు మొత్తం 37,755 టన్నులు ఉన్నాయి.

4. పారిశ్రామిక ఉపయోగాలు (Industrial Uses): ఇక మిగిలిన బంగారం పరిశ్రమల్లో ఉపయోగించబడుతోంది. ఎలక్ట్రానిక్స్, హై-ఎండ్ సర్క్యూట్లు, డెంటల్ అప్లికేషన్‌లలో gold ను వాడుతున్నారు. ఇలాంటి బంగారం మొత్తం 32,727 టన్నులు ఉంది.

global gold supply visual breakdown where is all the gold stored and mined
Photo Credit:

భూగర్భంలో ఉన్న బంగారం (Below-Ground Gold)

ఇక భూగర్భంలో ఉన్న బంగారం విషయానికొస్తే.. ఇది మొత్తం 1,32,118 టన్నులు ఉంది. మనం ఇప్పటికే చాలా బంగారం తవ్వి తీసినప్పటికీ.. భూమి ఉపరితలం క్రింద ఇంకా పుష్కలంగా బంగారం నిల్వ ఉంది. ఇది మళ్లీ రెండు రకాలుగా విభజించబడింది.

1. రిజర్వులు (Reserves) : రిజర్వులు అంటే ఇప్పటికే గుర్తించబడి వెలికితీయడానికి రెడీగా ఉన్న బంగారంఉ నిల్వలు. ఇది మొత్తం 54,770 టన్నులు ఉంది.

2. వనరులు (Resources) : ఇకపోతే ఇవి భౌగోళికంగా గుర్తించబడిన నిల్వలు. కానీ ప్రస్తుతానికి ఇంకా తవ్వితీయడానికి రెడీగా లేవు. ఇవి మొత్తం 77,340 టన్నులుగా ఉంది.

global gold supply visual breakdown where is all the gold stored and mined
Photo Credit:

మొత్తం బంగారం ఎంత?

మనం తవ్విన బంగారం (Above-Ground) , ఇంకా తవ్వని బంగారం (Below-Ground) మొత్తాన్ని కలిపితే.. ప్రపంచంలో దాదాపు 3,48,383 టన్నుల బంగారం ఉంది.
బంగారం.. ఎప్పటికీ బంగారమే..
ప్రపంచంలో బంగారానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నా.. ముఖ్యంగా ఈ ఏడాది 2025లో బంగారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పక్క అలంకరణగా.. మరోపక్క పెట్టుబడిగా.. ఇంకోపక్క దేశాలకు ఆర్థిక భద్రతగా.. బంగారం ఎప్పుడూ బంగారమే..!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+