బంగారాన్ని వీలయినంత కొనిపెట్టుకోండి.. భవిష్యత్తులో చేతికి కూడా చిక్కదు.. కారణం ఏంటంటే..

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ముఖ్యంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న వ్యూహాలు పసిడి ధరలకు గట్టి మద్దతును ఇస్తున్నాయి. సాధారణంగా మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతారు.

కానీ కేంద్ర బ్యాంకులు మాత్రం ఈ ధరల తగ్గుదలను ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందించిన తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సుమారు 30 టన్నుల బంగారాన్ని విక్రయించినప్పటికీ..ఈ ఆ అమ్మకాల వెనుక నిర్దిష్ట ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా టర్కీ, రష్యా దేశాలు తమ అంతర్గత అవసరాల కోసం ఈ విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది.

gold news central banks buying gold global gold rush gold reserves gold prices today central bank gold purchases global gold demand bullion market news gold investment trends safe haven asset gold market rally world gold demand gold reserves increase global economy and gold inflation hedge gold gold buying frenzy precious metals market gold market analysis central bank reserves gold price prediction global financial uncertainty countries buying gold gold investment news bullion prices international gold market gold as safe haven central bank strategy gold accumulation world economy news gold market trends

అయితే, ఈ అమ్మకాల ప్రభావాన్ని మించి అనేక దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నాయి. ముఖ్యంగా పోలాండ్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో Gold వాటాను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. చైనా దేశం అనుసరిస్తున్న పద్ధతిని చెప్పుకోవచ్చు.

చైనా సెంట్రల్ బ్యాంక్ గత 18 నెలలుగా నిర్విరామంగా తన బంగారు నిల్వలను పెంచుకుంటూ వస్తోంది. మార్చి నెలలో చైనా ఏకంగా 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత జరిగిన అతిపెద్ద నెలవారీ కొనుగోలుగా రికార్డు సృష్టించింది. ఆ సమయంలో Gold ధరలు 2026 జనవరిలో ఉన్న గరిష్ట స్థాయి కంటే సుమారు 16 శాతం తక్కువగా ఉండటంతో.. చైనా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

కేవలం అగ్రరాజ్యాలు మాత్రమే కాకుండా, చిన్న దేశాలు సైతం ఇప్పుడు బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ కొసావో. ఆ దేశం తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మారిన ఆర్థిక ముఖచిత్రానికి నిదర్శనం.

గతంలో కేవలం సంపన్న దేశాలకే పరిమితమైన ఈ సురక్షిత పెట్టుబడి వ్యూహం, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న చిన్న దేశాలకు కూడా పాకింది. కేంద్ర బ్యాంకులు ఇకపై కేవలం తక్షణ ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా కాకుండా, దీర్ఘకాలిక భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read

ప్రస్తుతం ప్రపంచ నిల్వల్లో బంగారం వాటా సుమారు 15 శాతంగా ఉంది. రాబోయే కాలంలో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. డాలర్ విలువలో వచ్చే మార్పులు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతల నుండి తమ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోవడానికి బంగారం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని దేశాలు భావిస్తున్నాయి.

ఈ నిరంతర కొనుగోళ్లు మార్కెట్‌లో ఒక రకమైన స్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారులు మరిన్ని ఆర్థిక సంకేతాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, కేంద్ర బ్యాంకుల మద్దతు బంగారం ధరలు భారీగా పడిపోకుండా కాపాడుతోంది. దీర్ఘకాలికంగా చూస్తే.. ఈ కొనుగోళ్ల జోరు పసిడి మార్కెట్‌కు ఒక గట్టి పునాదిని నిర్మిస్తోందని చెప్పవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+