బంగారంపై సరికొత్త గేమ్ మొదలైంది.. ప్రపంచ పసిడి మార్కెట్‌లో అసలు ఏం జరుగుతోంది..

Global Gold Reserves: ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న సైనిక వ్యయాల కారణంగా రష్యా తన ఆధునిక చరిత్రలోనే అత్యంత వేగంగా పసిడి నిల్వలను విక్రయిస్తోంది. సెప్టెంబరు నెలలో రష్యా విదేశీ మారక నిల్వల నుంచి సుమారు 6.2 టన్నుల బంగారం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనవరి నుంచి ఇప్పటివరకు రష్యా విక్రయించిన మొత్తం బంగారం పరిమాణం దాదాపు 62 టన్నులకు చేరుకుంది. 1998వ సంవత్సరంలో మూడేళ్ల వ్యవధిలో 118 టన్నులు విక్రయించిన తర్వాత రష్యా ఇంత వేగంగా నిల్వలను ఖాళీ చేయడం ఇదే ప్రథమం.

రష్యా తీవ్రమైన బడ్జెట్ లోటును భర్తీ చేయడంతో పాటు రక్షణ రంగానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకే ఈ విక్రయాలకు పాల్పడుతోందని పోలిష్ బులియన్ నిపుణుడు, మెన్నికా స్కార్బోవా మేనేజింగ్ డైరెక్టర్ ఆడమ్ స్ట్రోనియావ్‌స్కీ విశ్లేషించారు. లండన్ బులియన్ మార్కెట్ ఆంక్షల పరిధిలో ఉన్నందున.. రష్యా తన బంగారాన్ని ప్రధానంగా హాంగ్‌కాంగ్ కేంద్రంగా చైనా సెంట్రల్ బ్యాంక్‌కు అమ్ముతోందని తెలిపారు. హాంగ్‌కాంగ్ వాణిజ్య డేటా ప్రకారం జులై నాటికి రష్యా నుంచి 100 టన్నుల బంగారం అక్కడకు చేరింది. చైనా ఈ నిల్వలను నేరుగా కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ ధరలపై దీని ప్రభావం చాలా పరిమితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Gold Market Gold Prices Central Bank Gold Reserves Russia Gold Sales Kazakhstan Gold Reserves China Gold Buying Poland Gold Purchases Global Gold Demand Gold Price Forecast International Gold Market Gold Investment Bullion Market

అటు కజకిస్తాన్ కూడా తన విదేశీ నిల్వల్లో బంగారం వాటాను 78 శాతం నుంచి 75 శాతానికి తగ్గించుకునే దిశగా విక్రయాలకు సిద్ధమైంది. గత ఎనిమిది నెలలుగా గ్లోబల్ మార్కెట్లో భారీగా కొనుగోళ్లు జరిపిన కజకిస్తాన్, పసిడి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున లాభాల స్వీకరణ (Profit Booking) కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే కజకిస్తాన్ దశలవారీగా ఈ అమ్మకాలు చేపడుతున్నందున బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడబోదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read

రష్యా, కజకిస్తాన్‌లు అనుసరిస్తున్న ఈ బాటలోనే పోలాండ్ కూడా తమ నిల్వలను విక్రయిస్తుందా అనే సందేహాలపై ఆడమ్ స్ట్రోనియావ్‌స్కీ స్పష్టత ఇచ్చారు. పోలాండ్ నేషనల్ బ్యాంక్ 700 టన్నుల పసిడి నిల్వల లక్ష్యంతో చురుగ్గా కొనుగోళ్లు చేస్తోందని, దేశ పరపతి సదుపాయం మరియు కరెన్సీ స్థిరత్వానికి భారీ పసిడి నిల్వలు అవసరమని వివరించారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గణాంకాల ప్రకారం 2024లో 25.5 శాతం, 2025లో 67.4 శాతం పెరిగిన బంగారం ధరలు 2026 మొదటి తొమ్మిది నెలల్లో 4.4 శాతం మేర స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య కేంద్ర బ్యాంకులు పసిడిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తుండటంతో, దీర్ఘకాలంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటాయని, పసిడి ఎప్పటికీ చౌక కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+