దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. భారతదేశంలో పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పసుపులోహం పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు సందిగ్ధంలో పడ్డారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే భారత్ లో మాత్రం ధరల్లో పెరుగుదల నమోదైంది.
గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,376.69 డాలర్ల వద్దకు పడిపోగా.. US గోల్డ్ ఫ్యూచర్స్ 3,432.40 డాలర్లకి తగ్గినట్టు రాయిటర్స్ పేర్కొంది. అయితే అదే సమయంలో భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,330కి పెరిగింది. ఇది 10 గ్రాములకు రూ. 110 పెరుగుదలగా చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం కూడా రూ. 100 పెరిగి రూ. 93,800కి చేరుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్న డాలర్, ఆర్థిక డేటా, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల అంచనాలు.. ఇవన్నీ గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. CME ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్‌లో US ఫెడ్ రేటు కోత వచ్చే అవకాశం 88 శాతం గా ఉందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. బలహీనమైన జాబ్ డేటా ఈ అంచనాలకు మరింతగా బలాన్ని ఇచ్చింది. అయితే ఫెడ్ నుండి స్పష్టమైన సంకేతాల కోసం Gold ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బంగారం ఇప్పుడిప్పుడే సరైన దారిలోకి వస్తోంది. అదే సమయంలో డాలర్ బలపడడం కూడా కనిపిస్తోందని టేస్టీలైవ్ గ్లోబల్ మాక్రో హెడ్ ఇలియా స్పివాక్ రాయిటర్స్‌కు తెలిపారు.
భారతదేశంలో బంగారం ధరల పెరుగుదల వెనుక పలు కారకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వంతో పాటుగా వడ్డీ రేట్లపై RBI తటస్థ వైఖరి, వినియోగదారుల నమ్మకం, పండుగ సీజన్ డిమాండ్ ఇవన్నీ దేశంలొ బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ రూ. లక్షకు పైగా ఉన్న బంగారం ధర రిస్క్-విముఖతను సూచిస్తుంది. ఇది పెట్టుబడి నిపుణుల దృష్టిలో ఒక సురక్షితమైన ఆస్తిగా మారుతోందని అన్నారు.
బంగారం పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే.. బంగారాన్ని SIP రూపంలో నెలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే గోల్డ్ ETFs, డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తున్నారు. పెద్ద మొత్తాలను ఒకేసారి పెట్టడం కన్నా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటే రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ఆగ్‌మాంట్ రిసర్చ్ హెడ్ రెనిషా మాట్లాడుతూ.. పండుగల కాలంలో కొనుగోలు మరింత బలపడుతుంది. అందుకే రిటైల్ గోల్డ్ డిమాండ్, తక్కువ ద్రవ్యోల్బణంతో మరింత పెరగవచ్చని అన్నారు.
కాగా నేడు బంగారం ధరలు పెరగడం, తగ్గడం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధర భారీగానే పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆలోచించి క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే బంగారంలో పెట్టుబడులు పెట్టడం కూడా ముందు ముందు మంచి లాభాలు ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!



Click it and Unblock the Notifications