For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Omicron variant: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త అనిశ్చితులు

|

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త అనిశ్చితులు ఏర్పడవచ్చునని తెలిపింది. అయితే దీని వ్యాప్తి, కేసులు, మరణాలు, వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. 'మచ్ టు లర్న్ ఎబౌట్ ఒమిక్రాన్ ఫాస్ట్' పేరుతో మూడీస్ విశ్లేషణను అందించింది. ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని, మరో రెండు వారాలు గడిస్తే కానీ వైరస్ ప్రభావంపై అంచనాకు రాలేమని మూడీస్ అనలటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ స్టీవ్ కొక్రేన్ అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ మొదటిసారి నవంబర్ 24వ తేదీన సౌతాఫ్రికాలో గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత మరిన్ని దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. బోట్స్‌వానా, బెల్జియం, హాంగ్ కాంగ్, ఇజ్రాయెల్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాలో గుర్తించారు. ఇది ఆందోళనకర వేరియంట్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఈ వేరియంట్ ప్రభావం గురించి పూర్తిగా తెలియడానికి మరో రెండు వారాలు అవసరమని మూడీస్ అనలటిక్స్ తెలిపారు.

 Global Economy to face uncertainties again owing to Omicron variant

భారత్‌లో ఏప్రిల్-మే కాలంలో డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఆధారంగా ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని తెలిపింది. మయన్మార్, లావోస్, ఇండోనేషియా, ఇండియా, హాంగ్ కాంగ్, థాయ్‌లాంట్, పిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో 65 శాతం కంటే తక్కువ వ్యాక్సినేషన్ నమోదయిందని పేర్కొంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ట్రావెల్ అండ్ టూరిజం మరోసారి దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు దేశాలు ట్రావెల్ పైన ఆంక్షలు విధించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది.

English summary

Omicron variant: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త అనిశ్చితులు | Global Economy to face uncertainties again owing to Omicron variant

The Omicron variant of COVID-19 adds new uncertainties to the global economic outlook but much will depend on its speed of transmission, hospitalisation and death rates, and also the effectiveness of vaccines, Moody’s Analytics said on Monday.
Story first published: Tuesday, November 30, 2021, 11:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X